Amritha Aiyer: సినిమా పాన్ ఇండియా హిట్ అయినా అమృత అయ్యర్ పేరు వినిపించడం లేదుగా..!

  • January 19, 2024 / 07:34 PM IST

‘హనుమాన్’ సినిమా ఇటీవల అంటే జనవరి 12 న రిలీజ్ అయ్యింది. మొదటి షోకే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని సాధిస్తుంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా జరిగింది. బయ్యర్స్ కి భారీ ప్రాఫిట్స్ వస్తున్నాయి. హిందీలో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. హీరో తేజ సజ్జకి కూడా మంచి పేరొచ్చింది.

అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ హీరోయిన్ అమృత అయ్యర్ కి మాత్రం దక్కడం లేదు అనేది అందరి అభిప్రాయం. అమృత అయ్యర్.. మొదట తమిళంలో ‘లింగా’, ‘బిగిల్’ వంటి పెద్ద సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్ కాదు లెండి. కానీ తర్వాత తెలుగులో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, ‘రెడ్’ వంటి సినిమాలతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అవి ఎండు కూడా కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి.

అమృత నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ‘అర్జున ఫల్గుణ’ అనే సినిమాలో చేసింది. ఇది పెద్దగా ఆడలేదు. కానీ ఇటీవల వచ్చిన ‘హనుమాన్’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయినా .. ఇంకా ఈమెను ఎక్కువ మంది దర్శక నిర్మాతలు అప్రోచ్ అవ్వడం లేదు. ‘హనుమాన్’ ప్రమోషన్స్ లో మొదటి నుండి అమృతకి అన్యాయమే జరుగుతుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకి లభించిన క్రేజ్ కూడా ఈమెకు దక్కడం లేదు. ‘హనుమాన్’ ట్రైలర్లో ఈమెను చూపించింది లేదు. కానీ సినిమా కథ ముందుకు సాగేది ఈమె పాత్ర వల్లే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ఈమె (Amritha Aiyer) గురించి మాత్రం ప్రేక్షకులు కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus