Pooja Hegde: త్రివిక్రమ్‌ – మహేష్‌ సినిమాపై ఏంటీ కన్‌ఫ్యూజన్‌!

  • December 11, 2022 / 03:54 PM IST

మొదలుపెట్టినప్పటి నుండి ఏదో కారణంతో ఆగిపోతున్న సినిమాను ఏమంటారో? ఏమో అలాంటి పేర్లేమీ లేవు అంటారా? పేర్లు లేవు కానీ.. అలాంటి సినిమా మాత్రం రీసెంట్‌ టైమ్స్‌లో ఒకటుంది. అదే #SSMB28. అవును సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతష్ఠాత్మక చిత్రం గురించే చెబుతున్నాం. ఎప్పుడో మొదలవ్వాల్సిన సినిమా ఆలస్యంగా స్టార్ట్‌ అయ్యింది. మధ్యలో ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అయితే స్టార్ట్‌ అవ్వొచ్చు కూడా. ఏంటీ కన్ఫ్యూజన్‌ అంటారా?

మీరు అన్నట్లే కన్‌ఫ్యూజ్‌ చేస్తోంది మేం కాదు. సినిమా టీమ్‌. ఇదిగో సినిమా, అదిగో సినిమా అంటూ ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన టీమ్‌.. తాజాగా సినిమాను సంక్రాంతి తర్వాత రీషురూ చేస్తామంటోందని టాక్‌. అయితే కథానాయిక పూజా హెగ్డే అయితే ఈ నెల 15 నుండి మహేష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతోంది అని అంటున్నారు. దీంతో అభిమానుల్లో చిన్నపాటి కన్‌ఫ్యూజన్‌ మొదలైంది. షూట్‌ ఉందా? లేదా? అన్‌ డౌట్‌ పూజ హెగ్డే టీమ్‌కి కూడా ఉందని అంటున్నారు.

మహేష్‌ – త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ సినిమాగా ఈ సినిమా కొన్ని నెలల క్రితం పట్టాలెక్కింది. ఒక షెడ్యూల్‌ కూడా పూర్తి చేశారు. అందులో అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించారు కూడా. అయితే ఇప్పుడు ఆ సీన్స్‌ను పక్కన పెట్టేశారని అంటున్నారు. నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ సామాజిక మాధ్యమాల ద్వారా శనివారం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సినిమాను జనవరిలో స్టార్ట్‌ చేస్తామని తెలిపింది. అయితే సంక్రాంతి తర్వాతే అని టాక్‌.

దీంతో అటు హీరోయిన్‌ హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవుతోందని ఆమె టీమ్‌ చెబుతుంటే.. ఇటు నిర్మాత మాత్రం జనవరి అంటున్నారేంటబ్బా.. అనే కన్‌ఫ్యూజన్ మొదలైంది. అయితే పూజకు సరైన సమాచారం లేకనే.. అలా అయ్యిందని అంటున్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌ – త్రివిక్రమ్‌ కలిసి చేస్తున్న సినిమా ఇది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus