బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 నాలుగోరోజూ ఆట మంచి మజాని ఇచ్చింది. పవర్ రూమ్ యాక్సెస్ కోసం హౌస్ మేట్స్ రాత్రంతా పడిగాపులు కాచి మరీ ఉరుముల శబ్ధానికై వేచి చూశారు. కానీ రాత్రంతా బిగ్ బాస్ కనికరించలేదు. ఆ తర్వాత కాజల్ నిద్రపోతే సైరన్స్ మోగాయి. దీంతో మిగతా హౌస్ మేట్స్ కి సైతం నిద్ర డిస్టర్బ్ అయ్యింది. ఇక మద్యాహ్నం క్యాజువల్ గా ఉన్న టైమ్ లో పవర్ రూమ్ థండర్ సౌండ్ వచ్చింది. పరుగు పరుగున వెళ్లిన హమీద యాక్సెస్ ని తీస్కుంది.
పవర్ రూమ్ కి వెళ్లిన హమీదకి ఊహించని పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. మీరు సెలక్ట్ చేస్కునే ఒక ఇంటిసభ్యులు ఇక ఎప్పటికీ కెప్టెన్ కాలేరు అన్నాడు. దీంతో కాసేపు ఆలోచించిన హమీద ప్రియ పేరు చెప్పేసింది. ఇక్కడే హమీద తప్పు చేసింది. ఈ నిర్ణయం నేను తీస్కోలేను అని నాకు పవర్ రూమ్ యాక్సెస్ వద్దు అని నేను ఈవారం కెప్టెన్ కాకపోయినా పర్లేదు అని చెప్పి స్మార్ట్ గేమ్ ఆఢి ఉంటే అందరూ ఎప్రిషియేట్ చేసేవాళ్లు అలాగే ఆడియన్స్ దృష్టిలో పాయింట్స్ గెలుచుకునేది.
హమీద తీస్కున్న నిర్ణయం కారణంగా ప్రియ సీజన్ మొత్తానికి కెప్టెన్సీ ని వదిలేసుకోవాల్సి వచ్చింది. అయితే, బిగ్ బాస్ ఏదైనా టాస్క్ బాగా ఆడితే ఈ పవర్ ని తీస్కుని ప్రియకి కెప్టెన్సీ అవకాశాన్ని కల్పించే ఛాన్స్ ఉంది. ఇది బిగ్ బాస్ హౌస్ ఎప్పుడు ఏదైనా జరగచ్చు.
[yop_poll id=”2″]
Most Recommended Video
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం