Allu Arjun: హీరో బిరుదు మారిస్తే అంతా ఓకేనా

  • April 9, 2021 / 02:05 PM IST

మెగాస్టార్‌, నటరత్న, విక్టరీ, యువసామ్రాట్‌, యంగ్‌ టైగర్‌, మెగా పవర్‌ స్టార్‌, సూపర్‌స్టార్‌, రెబల్‌స్టార్‌, పవర్‌ స్టార్‌… ఇలా హీరోలకు బిరుదులు ఉన్నాయి మన దగ్గర. ఆ మాటకొస్తే ప్రతి వుడ్‌లోనూ ఇలాంటి బిరుదుల ఉంటూ ఉంటాయి. అయితే వాటిని ఆ హీరోలకు ఇచ్చేదెవరు అంటే ఏమో తెలియదు అని చెప్పాలి. కొంతమంది హీరోలే ఆ బిరుదు తగిలించుకుంటే, ఇంకొంతమంది దర్శకనిర్మాతలు ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజులకు ఆ బిరుదు మారిపోతుంటుంది. తాజాగా అలా బిరుదు మార్చుకున్న హీరో అల్లు అర్జున్‌. మరి ఇది అతనికి వర్కౌట్‌ అవుతుందా?

తొలుత ఇచ్చిన బిరుదులు మార్చడం చాలా రోజుల నుండి టాలీవుడ్‌లో ఉంది. చిరంజీవిని మొదట సుప్రీం హీరో అనేవారు. తర్వాత మెగాస్టార్‌కు మారింది. చాలా రోజుల క్రితం మహేష్‌బాబు బాబు బిరుదు ప్రిన్స్‌ తీసేసి… తండ్రికి ఉన్న సూపర్‌స్టార్‌ తగిలించుకున్నాడు. ఆ తర్వాత చాలా రోజులు ఎలాంటి మార్పు లేదు. ‘శక్తి’ టైమ్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న యంగ్‌ టైగర్‌ను ఆ సినిమా దర్శకుడు మెహర్‌ రమేష్‌ ‘ఏ1 స్టార్‌’ చేశాడు. అయితే ఆ సినిమా ఫలితం లాగే… ఆ బిరుదు కూడా మరుగున పడిపోయింది.

ఇప్పుడు అలా అల్లు అర్జున్‌ బిరుదు స్టైలిష్‌ స్టార్‌ను తీసేసి ‘ఐకాన్‌ స్టార్‌’ అని పెట్టారు సుకుమార్‌. ఈ పేరు కూడా బాగున్నప్పటికీ… అసలు ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలియక కొంతమంది అభిమానులు తలలు గోక్కుంటున్నారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ ‘ఏ1 స్టార్‌’ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అలా పేరు మార్చిన సినిమా బొక్క బోర్లాపడటమే ఓ కారణం. ఎంతో ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా ‘పుష్ప’. బన్నీ తొలి పాన్‌ ఇండియా సినిమా కూడా. ఈ సమయంలో ఇలాంటి మార్పులు అవసరమా అంటున్నారు. అయినా ఈ సెంటిమెంట్లు నమ్ముతారా అంటే ఏమో మన సినిమావాళ్లు వాటిని బాగా నమ్ముతారు కదా.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus