ప్రదీప్ పై ఇండస్ట్రీ చూపు!

  • January 22, 2021 / 04:12 PM IST

బుల్లితెరపై రారాజుగా వెలుగొందుతున్నాడు యాంకర్ ప్రదీప్. లేడీ యాంకర్లలో సుమ ముందంజలో దూసుకుపోతుంటే.. మేల్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు నెంబర్ వన్ గా దూసుకుపోతున్నాడు. పలు టీవీ షోలతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పుడు అతడిని హీరోగా వెండితెరకి పరిచయం చేయబోతున్నారు. ప్రదీప్ హీరోగా నటించిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మున్నా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా గతేడాది మార్చిలో విడుదల కావాల్సివుంది కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది.

ఈ గ్యాప్ లో సినిమాకి చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. ఫ్యాన్సీ అమౌంట్ ని చెల్లించి సినిమాను కొనడానికి ‘ఆహా’, ‘జీ5’ వంటి సంస్థలు ప్రయత్నించాయి. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఈ సినిమాపై నమ్మకం ఉంచి.. థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూశారు. ఫైనల్ గా ఈ నెల 29న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం..’ పాట సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి సినిమాపై పడింది. పైగా ప్రదీప్ హీరోగా సినిమా అంటే ఎలా ఉంటుందో చూడాలని ఇండస్ట్రీ జనాలు కూడా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా గనుక హిట్ అయితే ప్రదీప్ తో సినిమాలు చేయడానికి ఇద్దరు, ముగ్గురు నిర్మాతలు రెడీగా ఉన్నారు. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ప్రదీప్ హీరోగా మరిన్ని సినిమాలు మొదలుకావడం ఖాయం. నిజానికి మేల్ యాంకర్ లో కొందరు హీరోలుగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నించారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. కనీసం ప్రదీప్ అయినా.. సక్సెస్ అందుకొని ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus