‘బిగ్ బాస్4’ విన్నర్ ను బిగ్ బాసే డిసైడ్ చేసాడా?

Advertisement

‘బిగ్‌బాస్‌4′ సీజన్ క్లైమాక్స్ కు వచ్చేసింది.ఇక హౌస్ లో 8 మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు. అభిజీత్, హారిక, లాస్య, అఖిల్, మోనాల్, సోహైల్, అరియానా, అవినాష్.. లు ప్రస్తుతం హౌజ్‌లో ఉన్నారు. దాంతో టాప్5 లో ఎవరుంటారు, విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే విషయం పై చర్చలు మొదలయ్యాయి.’బిగ్‌బాస్‌3’ విన్నర్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్… ‌ అభిజీత్‌ విన్నర్ అవుతాడు అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు ‘బిగ్‌బాస్2’‌ విన్నర్‌ అయిన కౌశల్‌ కూడా అభిజీత్ బాగా ఆడుతున్నాడు.

అతను విన్నర్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పాడు. మరికొంత మంది అయితే అభిజిత్‌, సోహైల్‌ లలో ఒకరు విన్నర్ అవుతారని.. మరికొంత మంది అయితే అభిజిత్‌, లాస్య లలో ఒకరు విన్నర్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా అభిజీత్, లాస్య ల పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిజీత్ కనుక నామినేషన్స్ లో ఉంటే .. ఎక్కువ ఓట్లు అతనికే పడుతున్నాయట. అందుకే అంతా అభిజీత్ విన్నర్ అవుతాడని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. నిజంగా ప్రేక్షకుల ఓట్లను పరిశీలనలోకి తీసుకునే ‘బిగ్ బాస్’ విన్నర్ ను డిసైడ్ చేస్తారా? లేక ముందస్తు ఒప్పందం బట్టి డిసైడ్ చేస్తారా? అనే అనుమానాలు కూడా అందరిలోనూ నెలకొన్నాయి.ప్రతీ సీజన్లోనూ ఈ డిస్కషన్లు మామూలే.! ఇప్పుడు సీజన్ 4 కూడా ఫైనల్ స్టేజికి వచ్చెయ్యడంతో మరోసారి ఈ మ్యాటర్ హైలెట్ అవుతుంది అంతే..! ఈ వారం ఎలిమినేషన్ కూడా కీలకంగా మారనుంది అని కొంతమంది భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus