రవితేజ, వెంకీ ఫెయిల్ అయ్యారు.. మరి మహేష్ సక్సెస్ సాధిస్తాడా?

  • July 12, 2020 / 05:11 PM IST

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్ లు చాలా ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఓ సెంటిమెంట్ మహేష్ ఫ్యాన్స్ ను కాస్త అయోమయంలోకి నెట్టిందనే చెప్పాలి. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మహేష్ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. గట్టి పోటీలో కూడా ఈ చిత్రం 138కోట్ల షేర్ ను వసూల్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఇక్కడ దర్శకుడు అనిల్ రావిపూడి విషయంలో ఓ సెంటిమెంట్ ఎప్పటినుండో రిపీట్ అవుతూ వస్తోంది.

విషయం ఏమిటంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి ఏ హీరోతో వర్క్ చేసినా.. వాళ్లకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తూ వచ్చాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ‘పటాస్’ బిగ్గెస్ట్ హిట్, ఇక సాయి తేజ్ కెరీర్లో అప్పటి వరకూ ‘సుప్రీమ్’ నే కెరీర్ బెస్ట్, ఇక రవితేజ కెరీర్ లో ‘రాజా ది గ్రేట్’ వెంకటేష్-వరుణ్ ల కెరీర్ లో ‘ఎఫ్2’ చిత్రాలే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు మహేష్ కెరీర్లో కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.

మహేష్ ను పక్కన పెడితే.. కళ్యాణ్ రామ్,సాయి తేజ్,రవితేజ, వెంకీ, వరుణ్ వారు అనిల్ రావిపూడితో సినిమా చేసిన తరువాత వారు నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కళ్యాణ్ రామ్ ‘షేర్’, సాయి తేజ్ ‘తిక్క’,రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.వెంకీ నటించిన ‘వెంకీమామ’ .. వరుణ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రాలు కూడా ‘ఎఫ్2’ స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. మరి ‘సర్కారు వారి పాట’ చిత్రంతో మహేష్ అయినా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. ‘సరిలేరు నీకెవ్వరు’ కి మించిన హిట్ ఇస్తాడేమో చూడాలి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus