Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో ఆ రికార్డ్ చేరనుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. గుంటూరు కారం మూవీ గ్లింప్స్ తో మహేష్ బాబు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గుంటూరు కారం మాస్ స్ట్రైక్ కు ఏకంగా 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

గుంటూరు కారం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాలకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడంలో ఆశ్చర్యం లేకపోయినా కేవలం తెలుగులో మాత్రమే తెరకెక్కుతున్న సినిమాలకు ఈ రేంజ్ లో బిజినెస్ అంటే ఆశ్చర్యానికి గురవ్వాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. బిజినెస్ విషయంలోనే కాదని కలెక్షన్ల విషయంలో కూడా మహేష్ బాబు టాప్ లో నిలవాలని ఆ అరుదైన రికార్డ్ ను మహేష్ బాబు సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టైటిల్ విషయంలో తన సెంటిమెంట్ ను వదులుకుని మరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గుంటూరు కారం టైటిల్ పై కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నా సినిమా రిలీజ్ సమయానికి ఆ పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉంటుంది. మహేష్ బాబు ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి జక్కన్న సినిమా షూటింగ్ పనులతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మహేష్ (Mahesh) రాజమౌళి కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుండగా ఈ సినిమాతో రాజమౌళి తన రికార్డులను తానే బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ ఎప్పుడు విడుదలైనా పాన్ వరల్డ్ స్థాయిలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus