Naresh: మళ్లీ పెళ్లి సినిమాతో నరేష్ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందా?

  • May 4, 2023 / 11:34 AM IST

నరేష్, పవిత్రా లోకేశ్, వనితా విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి. నరేష్ నిజ జీవితంలోని ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నరేష్ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఎం.ఎస్.రాజు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా ద్వారా రాబోయే రోజుల్లో కూడా నరేష్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూపించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మళ్లీ పెళ్లి సినిమాతో సక్సెస్ సాధిస్తే సోలో హీరోగా నరేష్ మరిన్ని సినిమాలలో నటించే ఛాన్స్ అయితే ఉంది. మళ్లీ పెళ్లి నరేష్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కొంతమంది చెబుతున్నారు.

తెలుగుతో పాటు కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. పవిత్ర లోకేశ్ కు కన్నడలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు బోగట్టా. మళ్లీ పెళ్లి సినిమాకు నరేష్ నిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం. ఈ సినిమాలో జయసుధ, శరత్ బాబు, అనన్య నగళ్ల, రవివర్మ, రోషన్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా గురించి రమ్య రఘుపతి నుంచి ఏ విధంగా స్పందన ఉంటుందో చూడాల్సి ఉంది. అరుల్ దేవ్, సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. మళ్లీ పెళ్లి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. మళ్లీ పెళ్లి సినిమా నరేష్ కోరుకున్న భారీ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా సక్సెస్ సాధించాలని (Naresh) నరేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus