Pawan Kalyan: ఆ రికార్డులను పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయబోతున్నారా?

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని ఆయన ఫ్యాన్స్ లో చాలామంది భావిస్తారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారనే సంగతి తెలిసిందే. పవన్ నటించిన ఖుషి మూవీ ఈ నెల 31వ తేదీన థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈ సినిమాకు బుకింగ్స్ కూడా ఊహించని స్థాయిలో ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో రీరిలీజ్ అయిన సినిమాలతో పోల్చి చూస్తే ఖుషి మూవీకి బుకింగ్స్ మరింత ఎక్కువగా జరుగుతున్నాయని బోగట్టా. జల్సా మూవీని మించి బుకింగ్స్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు. ఈ సినిమాతో రీరిలీజ్ సినిమాలు క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులు కచ్చితంగా బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ క్రేజ్ కు నిదర్శనం ఇదేనని రీరిలీజ్ సినిమాలతో కూడా రికార్డులు క్రియేట్ చేసే సత్తా పవన్ కు సొంతమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

పవన్ సినిమాలు మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఈ సినిమాతో 2023లో పవన్ కళ్యాణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా హిందీలో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా 2023 సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఏడాదికి కచ్చితంగా ఒక సినిమా రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ కు ఆ సినిమాలతో సక్సెస్ కూడా దక్కుతోంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus