Pushpa2: కేజీఎఫ్2 రేర్ రికార్డ్ లను బ్రేక్ చేయడం పుష్ప2 మూవీకి సాధ్యమేనా?

  • April 5, 2024 / 06:30 PM IST

కేజీఎఫ్(K.G.F Chapter 1) , కేజీఎఫ్2 (K.G.F Chapter 2) టీజర్లు యూట్యూబ్ లో అరుదైన రికార్డులను సాధించాయనే సంగతి తెలిసిందే. కేజీఎఫ్2 టీజర్ కు యూట్యూబ్ లో ఏకంగా 275 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ టీజర్ రికార్డులకు దగ్గర్లో కూడా మరే భారతీయ సినిమా టీజర్ లేదు. అయితే కేజీఎఫ్2 సాధించిన రికార్డ్ ను బ్రేక్ చేయడం పుష్ప2 సినిమాకు సాధ్యమవుతుందా అనే చర్చ జోరుగా జరుగుతోంది. పుష్ప2 (Pushpa2) సినిమాపై సైతం పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

పుష్ప ది రూల్ సంథింగ్ స్పెషల్ అనేలా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుకుమార్ (Sukumar) డైరెక్షన్, బన్నీ (Allu Arjun) యాక్టింగ్, రష్మిక (Rashmika) గ్లామర్ ఈ సినిమా రేంజ్ ను పెంచుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. పుష్ప ది రూల్ అంచనాలకు అందని విధంగా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ స్క్రిప్ట్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

పుష్ప ది రూల్ మూవీ నిర్మాణ విలువల పరంగా టాప్ లో ఉందని సమాచారం అందుతోంది. ప్రతి యాక్షన్ సీన్ ను సుకుమార్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని భోగట్టా. మే నెల చివరి నాటికి బన్నీ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. జూన్ లేదా జులైలో ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ సాంగ్ పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది.

పుష్ప ది రూల్ సినిమా శంకర్ (Shankar) సినిమాల స్టైల్ లో ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విదేశాల్లో కూడా ఈ సినిమాకు సంబంధించిన సీన్లను షూట్ చేశారని తెలుస్తోంది. పుష్ప ది రూల్ బిజినెస్ పరంగా కూడా టాప్ లో ఉందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ బన్నీ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus