దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ లెవెల్ లో ఓ పాన్ ఇండియా సినిమా ఐడియాను ఎన్టీఆర్ ముందు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా ఎమోషనల్ యాక్షన్ సినిమాలు చేసిన తరువాత మళ్లీ అదే జోనర్ సినిమా చేస్తే బాగుండదని భావించిన ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో పక్కా ఫ్యామిలీ సబ్జెక్ట్ కావాలని అడిగాడట. దీంతో తన పాన్ ఇండియా కథను పక్కన పెట్టి ఎన్టీఆర్ కోసం చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ సిద్ధం చేశాడు త్రివిక్రమ్.
ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ ని జరుగుతోంది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి వచ్చేలోగా స్క్రిప్ట్ మొత్తం రెడీగా పెట్టి షూటింగ్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ ముందుగా అనుకున్న పాన్ ఇండియా లైన్ కూడా చాలా బాగా వచ్చిందట. దీంతో ఆ లైన్ ను కథగా డెవలప్ చేసి మరో హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఎన్టీఆర్ తో సినిమా తరువాత రామ్ చరణ్ తో ఆ పాన్ ఇండియా సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నాడట మాటల మాంత్రికుడు.
ఇప్పటివరకు రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాలేదు. చరణ్ కూడా చాలా కాలంగా త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు కానీ కుదరడం లేదు. త్రివిక్రమ్ కథ నచ్చితే గనుక చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్, పవన్ కళ్యాణ్ బ్యానర్ కలిసి నిర్మించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!