Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా ఇదేనా!

2024 సంవత్సరం టాలీవుడ్ సినీ అభిమానులకు పండుగ లాంటి సంవత్సరం అని చెప్పవచ్చు. వచ్చే ఏడాది థియేటర్లలో పుష్ప2, దేవర, గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు, ప్రాజెక్ట్ కే సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలలో బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేసే సినిమా ఏదనే చర్చ జరుగుతోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ కూడా ఈ రేసులో ఉండగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ సినిమా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాలలో సలార్ సినిమాకు కూడా బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేసే సత్తా అయితే ఉంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా ఏదో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న టాలీవుడ్ అన్ని సినిమాల బడ్జెట్ ఏకంగా 4000 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండబోతుందని సమాచారం అందుతోంది. టాలీవుడ్ సినిమాల బడ్జెట్ తో పాటు మార్కెట్ సైతం పెరుగుతోంది.

టాలీవుడ్ సినిమాలు రాబోయే రోజుల్లో కూడా పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. టాలీవుడ్ సినిమాలకు ఇతర భాషల్లో కూడా క్రేజ్ పెరుగుతుండగా ఆ సినిమాలు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. టాలీవుడ్ హీరోల సినిమాలు ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

టాలీవుడ్ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది. సోషల్ మీడియాలో సైతం సంచలనాలు సృష్టించడానికి ఈ హీరోలు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ హీరోలు సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఈ హీరోల క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో టాలీవుడ్ హీరోలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus