Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

ఇది కదా తల్లి ప్రేమ అంటే.. ఇది కదా ఇండస్ట్రీ అభిమానమంటే.. అనిపించకమానదు ఈ మాటలు వింటే. ఒక విధంగా ఇదే కరెక్ట్ కూడా అండ్‌ మన దగ్గర జరగదు కూడా. ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా? ఇంకెవరి గురించే రీసెంట్‌ ‘టాక్సిక్‌’ లాంటి సినిమా తీసుకొచ్చిన యశ్ గురించి. ఆ సినిమా వచ్చాక ఎలాంటి రియాక్షన్స్‌ వచ్చాయో మనందరికీ తెలుసు. ఇదే విషయం యశ్‌ తల్లి పుష్ప దగ్గర ప్రస్తావిస్తే.. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Yash Mother

నా కొడుకేం ఉగ్రవాది కాదు.. వాడి ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారన్నారు అంటూ యశ్‌ తల్లి వ్యాఖ్యానించారు. ‘కేజీయఫ్’ సినిమాకు ముందు యశ్‌ ఎవరు? అనే వ్యాఖ్యలపై కూడా ఆమె రియాక్ట్‌ అయ్యారు. ‘కేజీయఫ్‌’ సినిమాలకు ముందు యశ్‌కు వరుసగా ఐదు హిట్లు వచ్చాయి. కొంతమంది అన్నట్లు వాడు గుర్తింపు లేని వాడు అయితే ఇప్పుడు ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు అని ప్రశ్నించారు. నా కొడుకు కొందరిలా ధనిక కుటుంబంలో పుట్టలేదు. ఒక బస్ డ్రైవర్ కొడుకు, తన కృషితో ఉన్నత స్థాయికి ఎదిగాడు అని చెప్పుకొచ్చారామె.

ఒక తల్లిగా యశ్‌ని చూసి గర్వపడుతున్నాను. వాడు సాధించిన విజయం రాత్రికి రాత్రే వచ్చింది కదు. ‘కేజీయఫ్‌’ సినిమాకు ముందు అతడు పడ్డ కష్టానికి ఫలితమే ఆ సినిమా విజయం అని చెప్పారామె. కొన్ని రోజుల క్రితం యశ్‌ గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ తరహా కామెంట్లు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు ఇవి సమాధానాల్లా కనిపిస్తున్నాయి. మరోవైపు ‘టాక్సిక్‌’ విషయంలో యశ్‌కు కన్నడ నటులు మద్దతు తెలిపారు.

‘టాక్సిక్‌’ సినిమా కథ, పాత్రలు సాధారణ చిత్రాల్లా కమర్షియల్ పంథాలో సాగలేదు. అంతమాత్రాన వాళ్లు ఎంచుకున్న దారి తప్పు కాదు. ఒక ఆలోచనను సినిమాగా మలచి, తెరపైకి తీసుకురావడం వెనుక ఎంతో భారీ శ్రమ దాగి ఉంటుంది అని రిషబ్ అన్నారు. పాత్ర కోసం యశ్ పడిన కష్టాన్ని అభినందించారు. ఇదొక సాహసోపేతమైన ప్రయోగమని, యశ్‌కు తాను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. మరోవైపు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ సినిమాకు, యశ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.

9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus