“కేజీఎఫ్”తో (KGF) ఇండియా మొత్తం షేక్ చేసిన రాకింగ్ స్టార్ యశ్ (Yash) , ఆ తర్వాత చాన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా తర్వాత ఏం చేయాలి అనే మీమాంసలోనే చాలాకాలం ఊగిసలాడాడు. ఎట్టకేలకు గీతు మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో “టాక్సిక్”(Toxic) అనే సినిమా సైన్ చేసి షూటింగ్ మొదలుపెట్టాడు. యశ్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమా వీడియోలు, ఫోటోలు ఇప్పటికే లీక్ అవ్వడం, ఈ సినిమాలో బాలీవుడ్ & సౌత్ హీరోయిన్లు కూడా ఉన్నారని తెలియడంతో “టాక్సిక్” మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇదే క్రమంలో బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణంలోను యశ్ నటించనున్నాడు అనే వార్తలు వచ్చాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా కనిపించనున్న ఈ సినిమాలో యశ్ రావణుడిగా నటించనున్నాడని బోలెడన్ని వార్తలు వచ్చినప్పటికీ.. అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. అయితే.. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ “అవును “రామాయణం” చిత్రంలో నేను రావణుడిగా నటిస్తున్నాను” అని క్లారిటీ ఇచ్చాడు.
అంతే కాకుండా ఈ సినిమాలో సీతగా సాయిపల్లవిని (Sai Pallavi) ఎంచుకోవడానికి కారణం నేనే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా 2025లో సెట్స్ కు వెళుతుందట. దాదాపు 6 నెలల డేట్స్ ఇచ్చాడట. ఈ ప్రాజెక్ట్ అనంతరం తాను “కేజీఎఫ్ 3” మీద దృష్టి సారిస్తానని ఆ సినిమా ఎప్పడు విడుదలవుతుందో తెలియదు కానీ..
ఎప్పడు వచ్చినా ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు యశ్. ప్రస్తుతం యశ్ డేట్స్ దాదాపు 2027 వరకు ఖాళీ లేకపోయినా, తెలుగులో యశ్ తో ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేయడానికి ఓ భారీ నిర్మాణ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. మరి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎప్పటికీ బయటకి వస్తాయో చూడాలి.
The first official confirmation about #Ramayana by #Yash
He is Playing Ravan Role pic.twitter.com/IH0NP0qq3d
— Ayyappan (@Ayyappan_1504) October 22, 2024