యంగ్ హీరో భార్య ఓల్డ్ పిక్ వైరల్.. హీరోయిన్లను కూడా డామినేట్ చేసేలా ఉంది..!

పైన ఫోటోలో ఉన్న ఆమెను గుర్తుపట్టారా? ఆమె ఓ దివంగత స్టార్ హీరో కూతురు. అలాగే ఇప్పుడు ఓ స్టార్ హీరోకి చెల్లెలు. ఇంకా గుర్తుపట్టలేదా? సరే ఇంకో హింట్ ఇస్తా..! టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న ఓ యంగ్ హీరోకి భార్య. ఆ యంగ్ హీరో ఫిజిక్ మామూలుగా ఉండదు. బాలీవుడ్ హీరోలు కూడా ఇతని ఫిజిక్ చూసి వామ్మో అంటారు.ఈపాటికే కొందరు కనిపెట్టేసి ఉంటారు. అవును.. పైన కనిపిస్తున్న ఆమె హీరో సుధీర్ బాబు (Sudheer Babu) భార్య ప్రియదర్శిని.

ఈమె పాత ఫోటోని అంటే.. తమ పెళ్లి చూపుల ఫోటోని సుధీర్ బాబు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ప్రియదర్శినిని చూస్తుంటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అంత అందంగా కనిపిస్తుంది. హీరోయిన్లని సైతం డామినేట్ చేసేంత గ్లామర్ గా ఆమె ఈ ఫోటోలో ఉంది. ఈరోజు సుధీర్ బాబు – ప్రియదర్శిని..ల పెళ్లిరోజు. 2006వ సంవత్సరం మే 29న వీరి వివాహం జరిగింది.

నేటితో వీరి పెళ్ళై 18 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అందుకే సుధీర్ బాబు.. ప్రియదర్శిని ఫోటోని షేర్ చేసి ‘హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మై లవ్’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలోని నెటిజన్లు అందరూ వీరికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. వాళ్ళ పేర్లు చరిత్ మానస్, దర్శన్.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus