Hero Nani: ఇండస్ట్రీలో నాని ప్లేస్ మారుతుందా..?

  • December 3, 2022 / 07:32 PM IST

ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్ లో భాగంగా ‘హిట్’ సినిమాలను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘హిట్ 2’ సినిమా విడుదలైంది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు ‘హిట్ 3’ రాబోతుంది. అందులో హీరో ఎవరనేది ‘హిట్2’ సినిమా చివర్లో చెప్పేశారు. నాని పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ‘హిట్ 3’ హీరో తనే అని కన్ఫర్మ్ చేశారు. అయితే నాని ఈ పాత్ర చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి.

ఎందుకంటే నానికి ఇలాంటి సీరియస్ రోల్స్ పెద్దగా సూట్ కావు. రాజేంద్రప్రసాద్ తరువాత ఆ స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఫన్నీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నాని. ఎమోషనల్ సీన్స్ లో నాని పెర్ఫార్మన్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కామెడీ అండ్ ఎమోషన్ జోనర్స్ లో నానిని ఎవరూ బీట్ చేయలేరు. కానీ ఈ మధ్యకాలంలో అతడు కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఫెయిల్యూర్స్ ను చవి చూడాల్సి వచ్చింది.

అయినప్పటికీ డిఫరెంట్ రోల్స్ అనే ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. విలనీ టచ్ ఉన్న రోల్ చేయాలని ‘వి’ సినిమా ట్రై చేస్తే అది డిజాస్టర్ అయింది. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘గ్యాంగ్ లీడర్’, ‘టక్ జగదీష్’ ఇలా ఆయన చేసిన ప్రతి ప్రయత్నం బెడిసికొట్టింది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా మాత్రం ఆడింది. ‘అంటే సుందరానికి’ సినిమా అతడి జోనరే అయినప్పటికీ కొన్ని ఎలిమెంట్స్ వలన సినిమా ఆడలేదు. ఇప్పుడు గతంలో నాని చేసిన తరహా పాత్రలన్నీ వేరే హీరోలు చేస్తున్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీలోకి చాలా మంది యంగ్ హీరోలు వచ్చేశారు. సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి ఇలా చాలా మంది ఉన్నారు. నాని మాత్రం తన సేఫ్ జోనర్ వదిలేసి వేరే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీని వెనుక ఆయన ఆలోచనలు ఏంటో..?

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus