Gaalivaana: ఆకట్టుకుంటున్న రాధికా శరత్ కుమార్, సాయి కుమార్ ల ‘గాలివాన’ మోషన్ పోస్టర్‌..!

  • March 16, 2022 / 06:55 PM IST

‘జీ5’ ఓటిటి సంస్థ ఈ మధ్యకాలంలో రెట్టింపు జోష్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా సూపర్ హిట్ చిత్రాలను విడుదల చేస్తూ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అన్ని భాషల్లోనూ నేరుగా సినిమాలను తమ ప్లాట్ ఫామ్లో విడుదల చేస్తూనే పలు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందే వెబ్ సిరీస్ లను సైతం విడుదల చేస్తుంది.అంతేనా… పలు బడా ప్రాజెక్టులకి నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

Click Here To Watch Now

‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ‘లూజర్’ ‘సంకెల్లు’ (తమిళంలోని విళంగు సిరీస్ నుండి డబ్బింగ్ సిరీస్) వంటివి ‘జీ5’ లో విడుదలై ఎంత ప్రేక్షకాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా.. బిబిసి స్టూడియోస్‌ వారు నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో నిర్మించిన యురోపియన్‌ డ్రామాని తెలుగు నేటివిటీకి తగినట్టు ‘గాలివాన’ గా మార్పులు చేసి ఓ వెబ్ సిరీస్‌గా ప్రేక్షకులకి అందించేందుకు రెడీ అయ్యింది ‘జీ5’. ఈ సిరీస్ లో రాధికా శరత్‌ కుమార్‌, సాయి కుమార్‌ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్ మరియు నందిని రాయ్, తాగుబోతు రమేష్‌ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా టైటిల్ మరియు ఈ సిరీస్ లో నటించే నటీనటులను రివీల్ చేస్తూ ఓ మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా క్యూరియాసిటీని క్రియేట్ చేసే విధంగా ఉంది.గాలి వాన కురుస్తున్న సమయంలో ఒక ఇంటిని చూపిస్తూ క్యాస్టింగ్ ను రివీల్ చేసారు. కథ ఏంటి? అనే ఆసక్తిని కూడా ఈ మోషన్ పోస్టర్ నెలకొల్పిందని చెప్పొచ్చు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus