‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

  • February 12, 2021 / 12:01 PM IST

‘యాపిల్ ట్రీస్ స్టూడియోస్’ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మాతగా ‘అ!’ ‘కల్కి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. తేజ సజ్జ, ఆనంది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలయ్యింది. మొదటి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో…. మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. అంతేకాదు విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన..

వీక్ డేస్ లో కూడా పర్వాలేదనిపించింది. ఇక ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 1.72 cr
సీడెడ్ 1.02 cr
ఉత్తరాంధ్ర 0.61 cr
ఈస్ట్ 0.44 cr
వెస్ట్ 0.35 cr
కృష్ణా 0.46 cr
గుంటూరు 0.48 cr
నెల్లూరు 0.30 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 5.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.18 cr
ఓవర్సీస్ 0.28 cr
టోటల్ వరల్డ్ వైడ్ 5.84 cr (షేర్)

‘జాంబీ రెడ్డి’ చిత్రానికి 4.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవడానికి 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. 5 రోజుల్లోనే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది. 7వ రోజున 0.23 కోట్ల షేర్ ను వసూల్ చేసి డీసెంట్ రన్ ను కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఈరోజు నుండీ ‘ఉప్పెన’ వంటి క్రేజీ మూవీ విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఈరోజు నుండీ ‘జాంబీ రెడ్డి’ డౌన్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!</s

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus