Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ద్వి భాషా చిత్రాలకు పెరుగుతున్న డిమాండ్

ద్వి భాషా చిత్రాలకు పెరుగుతున్న డిమాండ్

  • February 14, 2017 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ద్వి భాషా చిత్రాలకు పెరుగుతున్న డిమాండ్

తెలుగు చిత్ర పరిశ్రమ రోజురోజుకి విస్తరిస్తోంది. ఇతర భాషా చిత్రాలు ఇక్కడ విజయం సాధించడమే కొంతకాలం క్రితం వరకు చూసాం. ఇప్పుడు టాలీవుడ్ లో రూపొందే చిత్రాలు ఇతర భాషల్లో సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. అందుకే ఫిలిం మేకర్స్ అనువాదానికి బై బై చెప్పి, ద్వి భాషా పద్ధతికి తలుపులు తెరుస్తున్నారు. ఈ విధానం నిర్మాతకు లాభాలను పంచి పెడుతోంది. ఇలా ఏకకాలంలో రెండు భాషల్లో తెరకెక్కిన సినిమాలపై ఫోకస్..

సైజ్ జీరో Size Zeroతెలుగుతో పాటు ఇతర భాషల్లో స్వీటీ అనుష్కకి అభిమానులు ఉన్నారు. అందుకే ఆమెను లీడ్ రోల్ గా పెట్టి ప్రకాష్ కోవెలమూడి సైజ్ జీరో అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో “ఇంజి ఇదుప్పజాజి” గా రిలీజ్ అయి విజయం సాధించింది.

ఊపిరి Oopiriకింగ్ నాగార్జున టాలీవుడ్ లో స్టార్ హీరో. కోలీవుడ్ లో యువ నటుడు కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరిని కథానాయకులుగా పెట్టి వంశీ పైడిపల్లి ఊపిరి/తొజా అనే ద్వి భాష చిత్రాన్ని రూపొందించారు. టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది.

మనమంతా Manamanthaమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇది వరకు స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో కనిపించారు. అయితే కథానాయకుడిగా తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మనమంతా మూవీ చేశారు. దీనిని ఏకకాలంలో తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో విస్మయం గా రిలీజ్ అయి సక్సస్ సొంతం చేసుకుంది.

అనామిక Anamikaబాలీవుడ్ లో హిట్ సాధించిన కహాని సినిమాను శేఖర్ కమ్ముల ఒకేసారి రెండు భాషల్లో చిత్రీకరించారు. తెలుగులో అనామికగా, తమిళంలో “నీ ఎంగే ఎన్ అంబే” గా విడుదల చేశారు. ఆశించినంతగా విజయం సాధించకపోయినప్పటికీ మంచి చిత్రంగా పేరు దక్కించుకుంది.

చీకటి రాజ్యం Cheekati Rajyamదేశంలో విశ్వనటుడు కమలహాసన్ గురించి తెలియని చిత్ర పరిశ్రమలేదు. తమిళంలో రూపొందే అయన సినిమాలు ఇతర భాషల్లో స్ట్రైట్ చిత్రమంతా విజయం సాధిస్తాయి. ఈ మధ్య కమల్ కూడా ద్విభాషా చిత్రాలకు మొగ్గుచూపుతున్నారు. ఆ విధంగా చీకటి రాజ్యాన్ని తెలుగు, తమిళం(తుంగ వనం)లో తెరకెక్కించారు. రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తుఫాన్ Toofanమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లో అడుగుపెట్టాలని అపూర్వ లఖియా దర్శకత్వంలో ద్విభాషా చిత్రాన్ని చేశారు. జంజీర్ /తుఫాన్ గా హిందీ, తెలుగులో రూపొందిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో రిలీజ్ అయి నిరాశ పరిచింది.

ఎటో వెళ్లిపోయింది మనసు Yeto Vellipoindhi Manasuగౌతమ్ వాసుదేవ మీనన్ మెగా ఫోన్ నుంచి వచ్చిన మరో ప్రేమకథ చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు”. నాని, సమంత జంటగా నటించిన ఈ మూవీ ద్విభాషా చిత్రం. తమిళంలో “నీదానే ఎన్ పోనవసంతం” గా రిలీజ్ అయి మంచి అనుభూతిని ఇచ్చింది.

కాంచన Kanchanaకొరియోగ్రాఫర్ నుంచి డైరక్టర్ అయి, హీరోగా ఎదిగిన రాఘవ లారెన్స్ తెలుగు, తమిళంలో ఒకే పేరుతో ద్విభాషా చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. హారర్ థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కిన “కాంచన” రెండు చోట్ల కలక్షన్ల వర్షం కురిపించింది.

రక్త చరిత్ర Rakthacharithraఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరక్టర్ గా గుర్తింపు సాధించుకున్న రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాను ఏకకాలంలో రెండు భాషల్లో తీశారు. సూర్య, వివేక్ ఒబెరాయ్ తదితరులు నటించిన ఈ మూవీ తమిళంలో రక్త సరితిరం గా రిలీజ్ అయి విజయవంతమైంది

సాహసం శ్వాసగా సాగిపో Sahasam Swasaga Sagipoద్విభాషా చిత్రంలో కొంత మంది ఆర్టిస్టులు మారడం సహజం. కానీ గౌతమ్ మీనన్ హీరోనే మార్చివేసి ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించి మరో సారి హిట్ కొట్టారు. తెలుగులో యువసామ్రాట్ నాగ చైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో, తమిళంలో శింబుతో “అఛ్చామ్ ఎంబాదు మదమయ్యాడా” గా తీశారు. ఇద్దరు హీరోలకు ఒకేసారి విజయాన్ని అందించారు. గతంలోనూ ఏమాయ చేసావే మూవీని ఇలాగే రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #10 Bilingual Tollywood Movies
  • #Anamika Movie
  • #Cheekati Rajyam Movie
  • #Kanchana 2
  • #Manamantha Movie

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

19 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

23 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

21 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 days ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

2 days ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

2 days ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version