‘హాలీవుడ్ టు టాలీవుడ్’ – రీమేక్!!!

  • March 18, 2016 / 01:45 PM IST

ఒక బాషలో హిట్ అయిన సినిమాలు ఇతర బాషల్లో రీమేక్ అవడం సహజమే. అయితే అలా చేసిన సినిమాలు చాలా వరకూ మంచి విజయాలు సాధించాయి. అలా హాలీవుడ్ నుచి టాలీవుడ్ కు రీమేక్ అయిన సినిమాల్లో కొన్ని మీకోసం…

ఖైదీ (1983) – ఫర్స్ట్ బ్లడ్

సుప్రీమ్ స్టార్ చిరంజీవి కరియర్ ను ఒక మలుపు తిప్పి, చిరును మెగా స్టార్ గా ఇండస్ట్రీలో టాప్ పొసిషన్ లో నిలిపిన చిత్రం ఖైదీ. ఈ చిత్రం హాలీవుడ్ ఫర్స్ట్ బ్లడ్ అనే చిత్రానికి అనుగుణంగా రీమేక్ అయ్యింది.

మర్యాద రామన్న (2010) – అవర్ హాస్పిటాలిటి

మగధీర సినిమా సక్సెస్ పై వచ్చిన విమర్శలను సవాల్ చేస్తూ…హీరో కన్న సినిమాకు కధ, కధనమే బలం అని తన టాలెంట్ ను ఉపయోగించి సునీల్ ను సక్సెస్ఫుల్ హీరోగా మార్చి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తీసిన చిత్రం మర్యాద రామన్న. 2010లో విడుదలయ్యి భారీ హిట్ సాధించిన ఈ సినిమా….అవర్ హాస్పిటాలిటి అనే హాలీవుడ్ చిత్రానికి అనుగుణంగా రీమేక్ అయ్యింది.

అంతఃపురం (1998) – నోట్ విత్ ఔట్ మై డాటర్

అంతర్గత కలహాల నేపధ్యంలో కృష్ణ వంశీ సంధించిన బాణం ఈ అంతఃపురం చిత్రం. 1998లో విడుదలయ్యి క్రిటిక్స్ మన్నలను పొందిన ఈ చిత్రం నోట్ విత్ ఔట్ మై డాటర్ అనే హాలీవుడ్ చిత్రానికి అనుగుణంగా రీమేక్ అయ్యింది.

అంజలి (1990) – సూన్ రైజ్ ద మిరకిల్ కంటిన్యూ

1990లో బేబీ శ్యామిలీ…తరుణ్ కీలక పాత్రలో మణిరత్నం తీసిన ఈ చిత్రం అప్పట్లో టాప్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు సాధించింది. ఇప్పటికీ ఈ చిత్రం అంటే ఇష్టపడేవారు ఉన్నారు. ఇక ఈ సినిమా…సూన్ రైజ్ ద మిరకిల్ కంటిన్యూ అనే హాలీవుడ్ సినిమాకు అనుగుణంగా రీమేక్ అయ్యింది.

చంద్ర లేఖ (1998) –  వైల్ యూ వేర్ స్లీపింగ్

నాగార్జున హీరోగా..రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో, కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం. అప్పట్లో అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యింది. అసలు రమ్య స్థానంలో టబూ నటించాల్సి ఉండగా, అప్పట్లో టబూ-నాగ పై వచ్చిన లవ్ రూమర్స్ కారణంగా ఆ పాత్రని రమ్య కృష్ణ నటించినట్లు సమాచారం.
ఇక ఈ సినిమా…వైల్ యూ వేర్ స్లీపింగ్ అనే హాలీవుడ్ సినిమాకు అనుగుణంగా రీమేక్ అయ్యింది.

గజినీ (2005) – మెమెంటో

సూర్య హీరోగా 2005లో ప్రముఖ తమిళ దర్శకుడు మురుగుదాస్ చేసిన ఎక్స్‌పెరిమెంటల్ సినిమా గజనీ. ఔట్‌స్ట్యాండింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించి సూర్యను తెలుగులో టాప్ హీరోగా నిలిపాడు. ఇక ఈ సినిమా…మెమెంటో అనే హాలీవుడ్ సినిమాకు అనుగుణంగా రీమేక్ అయ్యింది.

హలో బ్రదర్ (1994) – ట్విన్ డ్ర్యాగన్స్

అప్పట్లో నాగ్ కరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా, ఇప్పటికీ టాప్ మూవీగా నిలిచిన చిత్రం హలో బ్రదర్. ఈ.వీ.వీ తెరకెక్కించిన ఈ సినిమా నాగ్ కి మంచి పేరు తెచ్చిపెట్టు. భారీ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా…ట్విన్ డ్ర్యాగన్స్ అనే హాలీవుడ్ సినిమాకు అనుగుణంగా రీమేక్ అయ్యింది.

అరుణాచలం (1997) – బ్రూస్టర్స్ మిలియన్స్

తమిళ తలైవార్ రజని కాంత్ నటించిన ఈ చిత్రం 1997లో విడుదలయ్యి మంచి హిట్ సాధించింది. తెలుగు తమిళ బాషల్లో భారీ వసూళ్లు సాధించి, అప్పట్లో టాప్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా…బ్రూస్టర్స్ మిలియన్స్  అనే హాలీవుడ్ సినిమాకు అనుగుణంగా రీమేక్ అయ్యింది.

స్టాలిన్ (2006) – పే ఇట్ ఫార్వర్డ్

2006లో సహాయం చేసి ఫలితాన్ని ఆశించకుండా మరో ముగ్గురికి సహాయం చెయ్యమనే చిన్న ఆలోచనతో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ సేవ దృక్ఫదాన్ని టాలీవుడ్ లో మరోసారి తెరపై చూపించింది. ఈ చిత్రాన్ని మురుగుదాస్ తెరకెక్కించాడు. అయితే కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా, క్రిటిక్స్ మన్నాలను పొందింది ఈ చిత్రం. ఇక ఈ సినిమా…పే ఇట్ ఫార్వర్డ్  అనే హాలీవుడ్ సినిమాకు అనుగుణంగా రీమేక్ అయ్యింది.

దూకుడు (2011) – గుడ్ బై లెనిన్

ప్రిన్స్ మహేష్ బాబును సరికొత్త కోణంలో పరిచయం చేస్తూ…ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ప్రిన్స్ కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ప్రిన్స్ కు నంది అవార్డ్ ను సైతం తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా…గుడ్ బై లెనిన్ అనే హాలీవుడ్ సినిమాకు అనుగుణంగా రీమేక్ అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus