Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

గత కొద్ది రోజులుగా #itstartshere అంటూ ఊరిస్తూ వచ్చిన ప్రైమ్‌ వీడియో.. వినోదాన్ని టన్నులు టన్నులు సిద్ధం చేసి ఈ రోజు లోడ్‌ దింపేసింది. తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లతో జట్టు కట్టి ఆసక్తికర ప్రాజెక్టులను అనౌన్స్‌ చేసింది. ఈ క్రమంలో తమడా మీడియా ‘ఇసకపట్నం’ మీద అందరి దృష్టీ పడింది. కారణం నేటి తరం యువత తెగ మెచ్చేస్తున్న యాక్షన్‌, రివేంజ్‌, రస్టిక్‌, రూరల్‌ డ్రామాను సిద్ధం చేస్తుండటమే. ‘ఇసకపట్నం’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ సిద్ధం చేసింది తమడా మీడియా.

Isakapatnam Series

ఐశ్వర్య రాజేశ్‌, సముద్రఖని, సునీల్‌, నరేశ్ అగస్త్య, సుధాకర్‌ కొమాకుల ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘ఇసకపట్నం’ వెబ్‌ సిరీస్‌ను టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్, హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసి.. ‘స్పై’ సినిమాతో దర్శకుడిగా మారిన గ్యారీ బీహెచ్‌ రూపొందిస్తున్నారు. రాహుల్‌ తమడా, సాయిదీప్‌ రెడ్డి బొర్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌ రగతి కథ అందించగా, సయ్యద్‌ తాజుద్దీన్‌ మాటలు రాశారు.

సిరీస్‌ నేపథ్యం చూస్తే.. 1990ల కాలంలో ఇసకపట్నం అనే పోర్టు టౌన్‌ నేపథ్యంలో సాగుతుంది. నాయుడు అనే ఓ కరుడగట్టిన వ్యక్తి డబ్బు మదంతో ఆ ప్రాంత ప్రజలను చాలా ఏళ్లుగా ఇబ్బంది పెట్టి ఏలుతుంటాడు. అలాంటి సమయంలో న్యాయం కోసం పోరాడే ఓ యువతి, నమ్మకస్తుడైన అనుచరుడు, ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ సామాన్యుడు ఏం చేశారు అనేదే ప్రధాన కథ.

పైన చెప్పినట్లు నేటి తరం ప్రేక్షకులకు నచ్చినట్లు నేపథ్యం, ప్రామిసింగ్‌ కాస్టింగ్‌తో సిరీస్‌ ఆసక్తికరంగా కనిపిస్తోంది. సన్నివేశాలు, సెటప్‌ రిచ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్‌ వంశీ పచ్చిపులుసు విజువల్స్‌ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రవీణ్‌ లక్కరాజు మరోసారి అదరగొట్టారు. సన్నివేశాల ఎలివేట్‌ అయ్యేలా నేపథ్య సంగీతం అందించారు. గ్లింప్స్‌లోని డైలాగ్స్‌ సిరీస్‌ ఇంటెన్సిటీని చెప్పేలా ఉన్నాయి. త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమ్‌ అవుతుంది.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus