Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Pedarayudu Movie: 27 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Pedarayudu Movie: 27 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

  • June 15, 2021 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pedarayudu Movie: 27 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

మోహన్ బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన ‘పెదరాయుడు’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ పై హీరో మోహన్ బాబే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం కనపరిచారు. పెదరాయుడు గా అలాగే అతని పెద తమ్ముడు రాజా పాత్రల్లో నటించి మెప్పించారు. మోహన్ బాబు సరసన భానుప్రియ, సౌందర్య లు.. హీరోయిన్లుగా నటించారు.కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రంలో అతిథి పాత్రను పోషించడం మరో విశేషం. 1995వ సంవత్సరం జూన్ 15 న ఈ చిత్రం విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 27 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ‘పెదరాయుడు’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి :

1) మోహన్ బాబు వరుస ప్లాపుల్లో ఉన్న రోజులవి. అతను నటించి నిర్మించిన సినిమాలు అన్నీ ప్లాప్ అవడంతో అతను భారీ నష్టాల్లో కూరుకుపోయాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన రజినీకాంత్ ను కలవడం జరిగింది. మోహన్ బాబు తన పరిస్థితిని అంతా వివరించారు.అయితే కొద్ది రోజులకు మోహన్ బాబుకి రజినీ ఫోన్ చేసారు.అర్జెంట్ ఓ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేయమని మోహన్ బాబుతో చెప్పారట.

2) ఆ టైములో తమిళంలో ‘నాట్టమై’ అనే చిత్రం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అక్కడ సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది. ఆ చిత్రాన్ని చూసిన రజినీకి అది బాగా నచ్చేసింది. దాంతో మోహన్ బాబుతో ‘నాట్టమై’ అనువాద హక్కులను కొనుగోలు చేసేలా చేసారు. అంతేకాదు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఊరి పెద్ద పాత్రను నేను చేస్తాను అని మాట కూడా ఇచ్చారు.

3) రజినీ మాట ప్రకారం.. వెంటనే ‘నాట్టమై’ హక్కులను కొనుగోలు చేసి.. దర్శకుడి కోసం అన్వేషిస్తూ వచ్చారు. కొంతమందిని పరిశీలించిన తర్వాత రీమేక్ లకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రవిరాజా పినిశెట్టిని ఫైనల్ చేసారు.

4)మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తండ్రి ‘పెదరాయుడు’ చిత్రానికి రైటర్ గా పనిచేసారు. ఒరిజినల్ ను యాజ్ ఇట్ ఈజ్ గా దింపేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు మార్పులు చేశారు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం ఆయన రాసిన డైలాగ్స్ అద్భుతం అనే చెప్పాలి.

5) తమిళంలో పాపారాయుడు పాత్రని విజయ్ కుమార్ పోషించారు. దానికి పెద్దగా బిల్డప్ ఉండదు. కానీ తెలుగులో ఆ పాత్రని రజినీ పోషిస్తుండడంతో ఇక్కడ దానికి భిన్నంగా డిజైన్ చేశారు. ఈ పాత్రని దర్శకుడు రవిరాజా పినిశెట్టి తీర్చిదిద్దిన తీరుకి మెచ్చుకోకుండా ఉండలేము.

6) 1995వ సంవత్సరం జూన్ 15 న ఈ చిత్రం విడుదల కాబోతుంది అని అనౌన్స్ చేశారు. అయినప్పటికీ సినిమా పై ఎటువంటి అంచనాలు లేవు. ఎందుకంటే అదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘బిగ్ బాస్’ చిత్రం విడుదలవుతుంది కనుక..!

7) ఎక్కువ శాతం స్క్రీన్లు ‘బిగ్ బాస్’ మూవీకే దక్కాయి. కానీ మార్నింగ్ షో పడిన వెంటనే ‘బిగ్ బాస్’ కు ప్లాప్ టాక్ రావడం.. ‘పెదరాయుడు’ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడం జరిగింది. ఈవెనింగ్ షోల నుండీ ‘పెదరాయుడు’ హవా మొదలైంది.ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే..!

8) రెండో వారం నుండీ ‘పెదరాయుడు’ వసూళ్లు అమాంతం పెరిగాయి. ఫైనల్ గా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 40 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. అప్పటివరకు టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా చిరంజీవి ‘ఘరానామొగుడు’ ఉంది. ఆ చిత్రం రూ.10 కోట్లను కొల్లగొట్టింది. అయితే ‘పెదరాయుడు’ చిత్రం దానిని అధిగమించి ఫుల్ రన్లో రూ.12కోట్ల వసూళ్ళను రాబట్టింది.

9) ఈ చిత్రంలో భార్య గొప్పతనాన్ని తెలుపుతూ.. ‘ది రిలేషన్ షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హజ్ బ్యాండ్ అనే డైలాగ్ ఉంటుంది. దీనికి అర్ధం తెలియనప్పటికీ మాస్ ప్రేక్షకులు ఈలలు వేశారు. ఇక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజినీ ఎపిసోడ్ కు మాస్ థియేటర్లు దద్దరిల్లాయి. కేవలం ఈ పాత్ర కోసమే ‘పెదరాయుడు’ ని 10 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

10) ఇక మోహన్ బాబు తనకు ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి మరీ ఈ సినిమాని నిర్మించాడు. అలాగే పెదరాయుడు పాత్రకు ఆయన జీవం పోసాడనే చెప్పాలి. అటు తర్వాత ‘పెద్దన్నయ్య’ లో బాలకృష్ణ, ‘సూర్యవంశం’ లో వెంకటేష్ లు ఆ టైపు పోషించినా.. అవి మోహన్ బాబుని మరిపించలేకపోయాయి అనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohan Babu
  • #Pedda rayudu
  • #Rajinikanth
  • #Ravi Raja pinisetty

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

46 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

58 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version