‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

  • August 9, 2023 / 05:41 PM IST

ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం రిలీజ్ కాబోతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాలం’ చిత్రానికి ఇది రీమేక్. మెహర్ రమేష్ దర్శకుడు. అయితే ఎందుకో ఈ చిత్రం పై ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. ఈ సినిమా కథ మొత్తం సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందింది. సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటించింది. గతంలో కూడా సిస్టర్ సెంటిమెంట్ తో సినిమాలు వచ్చాయి.అవేంటో.. వాటి ఫలితాలు ఏంటో.. ఓ లుక్కేద్దాం రండి :

1) హిట్లర్ :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1997 లో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన మమ్ముట్టి.. ‘హిట్లర్’ కి ఇది రీమేక్. చిరంజీవి ప్లాపుల్లో ఉన్న టైంలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి అతన్ని హిట్ ట్రాక్ ఎక్కించింది. ఈ సినిమా కథ అంతా హీరో చెల్లెల్ల చుట్టూ తిరుగుతుంది.

2) యువరత్న రాణా :

బాలకృష్ణ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1998 లో వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమా కథ అంతా హీరో చెల్లెలి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

3) శివరామరాజు :

జగపతి బాబు హీరోగా హరికృష్ణ కీలక పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి వి.సముద్ర దర్శకుడు. 2003 లో వచ్చిన ఈ సినిమా కథ మొత్తం చెల్లెలి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.

4) పుట్టింటికి రా చెల్లి :

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2004 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ మొత్తం చెల్లెలి గురించే. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

5) అర్జున్ :

మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2004 లో వచ్చింది. కీర్తి రెడ్డి మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది. కవల పిల్లలు అయిన అక్కాతమ్ముడి చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

6) అన్నవరం :

పవన్ కళ్యాణ్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2007 లో రిలీజ్ అయ్యింది. హీరో చెల్లెలి పాత్ర చుట్టూ జరిగే కథ ఇది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్నే అందుకుంది.

7) రాఖీ :

ఎన్టీఆర్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2007 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ మొత్తం హీరో చెల్లెలి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

8) గోరింటాకు :

రాజశేఖర్ హీరోగా వి.ఆర్.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2008 లో రిలీజ్ అయ్యింది. ఇది కూడా చెల్లెలి పాత్ర చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది.

9) శౌర్యం :

గోపీచంద్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2008 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ మొత్తం చెల్లెలి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది.

10) కళ్యాణ్ రామ్ కత్తి :

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010 లో రిలీజ్ అయ్యింది.ఈ సినిమా కథ మొత్తం చెల్లెలి గురించే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

11) బ్రూస్ లీ :

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2015 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ మొత్తం హీరో సోదరి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్ అయ్యింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus