Heroes: రవితేజ టు వెంకటేష్.. పక్క భాషల సినిమాల్లో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్లు

  • April 14, 2023 / 02:28 PM IST

ఈ మధ్యనే దర్శకుడు గుణశేఖర్ మన టాలీవుడ్ హీరోల గురించి ఓ కామెంట్ చేశాడు. అదేంటి అంటే.. ‘బాలీవుడ్ హీరోలు చిన్న సినిమా.. పెద్ద సినిమా, చిన్న పాత్ర.. పెద్ద పాత్ర అనే తేడా లేకుండా వచ్చి యాక్ట్ చేస్తారు. తమ వల్ల సినిమాకి మైలేజ్ చేకూరుతుంది అంటే.. వాళ్ళు ఎటువంటి సందేహం పెట్టుకోకుండా నటిస్తారు. కానీ మన టాలీవుడ్ హీరోలు అలా కాదు. మనవాళ్ళు ఈ విషయంలో ఇంకా మారాలి. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు చేసేవారు’ అంటూ గుణశేఖర్ తన ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను డైరెక్ట్ చేసిన గత చిత్రం.. ‘రుద్రమదేవి’ లో అల్లు అర్జున్ నటించినప్పటికీ..

అతని కోసం పాత్రలో చాలా త్యాగాలు చేశామని పరోక్షంగా గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. ఏదైతేనేం.. గుణశేఖర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఒకేసారి ట్రాక్ రికార్డు చూసుకుంటే.. మన హీరోల్లో చాలా మంది పక్క భాషల్లోని సినిమాల్లో ఛాన్స్ లు వస్తే చేయలేదు. సీనియర్ స్టార్ హీరోలైనా వెంకీ, నాగ్ లు మాత్రమే చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫేడౌట్ దశలో ఉన్నారు కాబట్టి.. ఇప్పుడు మొదలుపెట్టారు. గతంలో వీళ్లకు కూడా మంచి సినిమాల్లో అవకాశాలు వస్తే చేయలేదు. వీళ్ళలానే చాలా మంది (Heroes) హీరోలు ఈ లిస్ట్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రవితేజ- వడా చెన్నై :

ఈ చిత్రంలో స్మగ్లర్ రాజన్ పాత్ర. దీనికి రవితేజని అడిగితే చేయనని చెప్పినట్టు దర్శకుడు వెట్రిమారన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

2) అల్లు అర్జున్ – వడా చెన్నై :

ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం అల్లు అర్జున్ ను సంప్రదించాడు దర్శకుడు వెట్రిమారన్. కానీ అల్లు అర్జున్ ఆ పాత్ర చేయలేదు. వెనుక ఏం జరిగింది అన్నది సస్పెన్స్.




3) మహేష్ బాబు- పొన్నియన్ సెల్వన్ :

ఈ చిత్రంలో జయం రవి పోషించిన పాత్రకి మహేష్ బాబుని అడిగారు. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ పాత్ర చేయలేకపోయాడు.




4) జవాన్ – అల్లు అర్జున్ :

షారుఖ్ ఖాన్ – అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం అల్లు అర్జున్ ను సంప్రదించారు. కానీ ఆ పాత్రకు బన్నీ నొ చెప్పాడు.




5) నాగార్జున – పీఎస్ 1:

ఈ చిత్రం విక్రమ్ పోషించిన పాత్రకు నాగార్జునని అడిగాడు దర్శకుడు మణిరత్నం. కానీ నాగ్ చేయలేదు. మణిరత్నం తెరకెక్కించిన ‘ఘర్షణ’ చిత్రంలో కూడా నాగ్ ను ఓ హీరోగా అనుకున్నాడు. ఆ చిత్రాన్ని కూడా నాగ్ రిజెక్ట్ చేశాడు. కాంచన(ముని 2) చిత్రంలో శరత్ కుమార్ పోషించిన పాత్ర కోసం నాగ్ ను అడిగాడు లారెన్స్. అందుకు నాగ్ సింపుల్ గా నొ చెప్పాడు.




6) నాని :

‘రాజా రాణి’ చిత్రంలో ‘జై’ పోషించిన పాత్ర కోసం నానిని సంప్రదించాడు దర్శకుడు అట్లీ. కానీ కొన్ని కారణాల వల్ల నాని ఈ చిత్రంలో నటించలేదు.




7) అల్లు శిరీష్ :

సూర్య – మోహన్ లాల్ – ఆర్య కాంబినేషన్లో వచ్చిన ‘బందోబస్త్’ చిత్రంలో.. ఆర్య పాత్ర కోసం మొదట శిరీష్ ను అడిగారు. కానీ అతను చేయలేకపోయాడు.




8) రాజశేఖర్ :

‘ఒకే ఒక్కడు’ సినిమాలో హీరోగా మొదట రాజశేఖర్ ను అనుకున్నాడు శంకర్. కానీ అతను నొ చెప్పడంతో అర్జున్ ఫైనల్ అయ్యాడు.




9) వెంకటేష్ :

మణిరత్నం డైరెక్ట్ చేసిన ఘర్షణ(1988) లో నాగ్ తో పాటు వెంకీకి కూడా ఓ హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. కానీ వెంకీ నో చెప్పాడు. అలాగే ‘రోజా’ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. దానికి కూడా వెంకీ నో చెప్పాడు.




10) చిరంజీవి :

‘చంద్రముఖి’ చిత్రాన్ని మొదట చిరుతో చేయాలని ప్లాన్ జరిగింది. ముందుగా పి.వాసు కాకుండా వేరే దర్శకుడు చిరుతో ఆ చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ వర్కౌట్ కాలేదు.




Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus