Game Changer: గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ భారీగా ప్లాన్ చేసిన శంకర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకోబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్ని వేషాలను కోసం చిత్ర బృందం హైదరాబాద్ శివారులో భారీ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది.శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోనే క్లైమాక్స్ సన్నివేశం గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్లైమాక్స్ సన్నివేశాన్ని ఏకంగా 1000 మంది ఫైటర్స్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను రూపొందించారని టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే సెట్ వర్క్ మొత్తం పూర్తి కాగా మరి రెండు మూడు రోజులలో ఈ క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నట్టు సమాచారం. కేజీఎఫ్’ యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్బు అండ్ అరివు ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్ ను కొరియోగ్రాఫ్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇలా ఈ సినిమాలో (Game Changer) క్లైమాక్స్ సన్నివేశాన్ని భారీగా చిత్రీకరించబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఇక ఇందులో రామ్ చరణ్ కు జోడిగా నటి కియారా అద్వానీతో పాటు అంజలి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ భారీ స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డాన్స్ కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని ఈ సినిమా కోసం ఇండియాలో టాప్ సిక్స్ కొరియోగ్రాఫర్స్ పనిచేశారని సమాచారం.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus