సినిమాలు అన్నాక హిట్ ప్లాపులు సహజం…హిట్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇంకో హిట్ పాలన్ చేసుకోవడం… ప్లాప్ వస్తే మరో ఫోప్ రాకుండా జాగ్రత్త పడటం మన హీరోలు, డైరెక్టర్లు చేసే పని. ఒక ప్లాప్ పడితే నెక్స్ట్ సినిమాకి మరో హిట్ కాకపోయినా ప్లాప్ టాక్ రాకుండా యావరేజ్ ఇచ్చిన చాలు ఫాన్స్ హ్యాపీ గ ఉంటారు…కానీ కొందరు తెలుగు హీరోల విషయంలో ఇది తలకిందులు అయ్యింది.
ప్లాపు వెనుక ప్లాప్…తో కొందరు హీరోస్ (Heroes) తమ కెరీర్లోనే బాడ్ టైం ఎదురుకున్న రోజులు ఉన్నాయి. ఆ హీరోలు ఎవరు…ఆ వరుస ప్లాపుల కథ ఏంటో ఓ సారి చూసేద్దాం పదండి.
1. పవన్ కళ్యాణ్ – వరుసగా 5 ప్లాపులు
ఖుషి ఇండస్ట్రీ హిట్ ఆ తరువాత చేసిన జానీ పెద్ద డిజాస్టర్..అక్కడితి ఆగలేదు గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు కూడా అంతే ప్లాపులు. కట్ చేస్తే త్రివిక్రమ్ తో తీసిన జల్సా తో బ్రేక్ పడింది.
2. మహేష్ బాబు – ముచ్చటగా మూడు ప్లాపులు
పోకిరి పెద్ద ఇండస్ట్రీ హిట్ ఆ తరువాత చేసిన సైనికుడు సినిమా డిసాస్టర్. అతిది కూడా ప్లాప్ ఎహ్, ఆ తరువాత చేసిన ఖలేజా అయితే అట్టర్ ప్లాప్ కానీ ఇప్పుడు అదే సినిమా కల్ట్ క్లాసిక్ అంటున్నారు లెండి అది వేరే విషయం.
3. రవితేజ – వరుసగా 6 ప్లాపులు
ఒక సినిమా హిట్ పడితే మూడు ప్లాపులు వస్తాయి ఇది మాస్ మహారాజ తీరు. మిరపకాయ మాస్ హిట్ అయితే దాని తరువాత చేసిన దొంగల ముఠా, వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మ్నాఉషులు & సారొచ్చారు లాంటి కళాకండాలు ఇచ్చారు మాస్ మహారాజ్ లాస్ట్ కి బలుపు తో ఈ ఫ్లోప్స్ కి బ్రేక్ పడింది.
4. జూ ఎన్టీఆర్ – వరుసగా 6 ప్లాపులు
రాజమౌళి తో సింహాద్రి లాంటి బ్లాక్బస్టర్ సినిమా పడ్డాక ప్లాప్ పడాల్సిందే. సింహాద్రి తరువాత జూ ఎన్టీఆర్ ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ & రాఖి సినిమాలతో ప్లాపులు పేస్ చేసాడు. కట్ చేస్తే మల్లి రాజమౌళి యమదొంగ తోనే ప్లాప్స్ కి బ్రేక్ పడింది.
5. నాని – వరుసగా 4 ప్లాపులు
రాజమౌళి తో హిట్ సినిమా తరువాత ఆ మాత్రం ఉంటది…ఈగ లాంటి హిట్ సినిమా తరువాత ఏటో వెళ్ళిపోయింది మనసు, పైసా, ఆహా కళ్యాణం, జండా పై కపిరాజు లాంటి ప్లాప్స్ పాడ్తాయి తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం తో కొంచెం ట్రాక్ ఎక్కాడు నాని.
6. మంచు విష్ణు – ముచ్చటగా మూడు ప్లాపులు
ఢీ ల్లాంటి హిలేరియస్ హిట్ తరువాత మంచు విష్ణు కృష్ణార్జున యుద్ధం, సలీం, వస్తాడు నా రాజు లాంటి డిజాస్టర్స్ పేస్ చేసి లాస్ట్ కి దేనికైనా రెడీ తో హిట్ కొట్టాడు.
7. సాయి ధరమ్ తేజ్ – వరుసగా 6 ప్లాపులు
సుప్రీమ్ తరువాత తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ & తేజ్ ఐ లవ్ యు లాంటి అట్టర్ ఫ్లోప్స్ తీసాడు సాయి ధరమ్ తేజ్…ఈ ప్లాప్స్ కి చిత్రలహరి తో బ్రేక్ పడింది.
8. గోపీచంద్ వరుసగా 6 ప్లాపులు
లౌక్యం తరువాత గోపీచంద్ జిల్, సౌఖ్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్, పంతం & చాణక్య సినిమాలు అన్ని పెద్ద డిజాస్టర్ అయ్యాయి…లాస్ట్ కి సీటీ మార్ సినిమాకి కొంచెం మంచి టాక్ రావడం తో ప్లాప్స్ కి బ్రేక్ పడింది.
9. నితిన్ – వరుసగా 6 ప్లాపులు
ఇక రాజమౌళి సెంటిమెంట్ కి ఎక్కువ సఫర్ అయ్యింది మన నితిన్ మరి …సై తరువాత అల్లరి బుల్లోడు తో మొదలు అయినా ప్లాప్ స్ట్రీక్ 12 ప్లాప్స్ తో అరా డజన్ ప్లాప్స్ తో ఆగింది లాస్ట్ కి విక్రమ్ కే కుమార్ తో తీసిన ఇష్క్ మూవీ నితిన్ కి సెకండ్ లైఫ్ లాంటిది. .
10. ప్రభాస్ – వరుసగా 6 ప్లాపులు
మళ్ళీ రాజమౌళి ఫాక్టర్… రాజమౌళి తో కలిసి ఛత్రపతి మూవీ చేస్తే అది ప్రభాస్ కి మాస్ హిట్ తో పాటు మాస్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. కానీ ఛత్రపతి తరువాత వరుసగా ఆరు ప్లాపులు చుసిన ప్రభాస్ కి డార్లింగ్ బ్రేక్ ఇచ్చింది.