Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నా క్యారెక్టర్ చుట్టూ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తిరుగుతుంది, చాందినికి ఏమైందనేది థియేటర్లలో చూడండి – అవికా గోర్ ఇంటర్వ్యూ

నా క్యారెక్టర్ చుట్టూ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తిరుగుతుంది, చాందినికి ఏమైందనేది థియేటర్లలో చూడండి – అవికా గోర్ ఇంటర్వ్యూ

  • June 27, 2022 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా క్యారెక్టర్ చుట్టూ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తిరుగుతుంది, చాందినికి ఏమైందనేది థియేటర్లలో చూడండి – అవికా గోర్ ఇంటర్వ్యూ

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూలై 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అవికా గోర్‌తో ఇంటర్వ్యూ…

ప్రశ్న: హాయ్ అవికా గోర్! ఎలా ఉన్నారు?
అవికా గోర్: ఐయామ్ గుడ్. చాలా బావున్నాను. త్వరలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను.

ప్రశ్న: ‘టెన్త్ క్లాస్ డైరీస్’ గురించి చెప్పండి… సినిమా ఎలా ఉండబోతోంది?
అవికా గోర్: ఇదొక స్వీట్ మూవీ. మీ టెన్త్ క్లాస్ సభ్యులు అందరూ కలిస్తే… రీ యూనియన్ అయితే… ఎలా ఉంటుందనేది చూపించారు. రీ యూనియన్ ఒక్కటే కాదు. సాంగ్స్, ట్రైలర్‌లో చూపించని ఒక ఎమోషన్ ఉంది. ఇంకా ఇందులో లిటిల్ బిట్ డ్రామా, ఫ్లాష్‌బ్యాక్‌, కామెడీ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా, చాలా వినోదాత్మకంగా దర్శకుడు అంజి తెరకెక్కించారు. నేను ఎంపిక చేసుకునే కథలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ కథను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకు డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది.

ప్రశ్న: టెన్త్ క్లాస్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి?
అవికా గోర్: సినిమా షూటింగ్స్! ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తూ… మరో వైపు షూటింగ్స్ చేశా. నేను స్కూల్‌కు వెళ్ళింది తక్కువ. లొకేషన్స్‌లో, సెట్స్‌లో ఉన్నది ఎక్కువ.

ప్రశ్న: మీ క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉంటాయా? ఒక్కటేనా?
అవికా గోర్: ఐ డోంట్ నో! నాకు తెలియదు. మీరు సినిమా చూసి తెలుసుకోవాలి (నవ్వులు). సినిమా నా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అందులో చాలా సస్పెన్స్ ఉంది. సినిమాలో నా పాత్ర పేరు చాందిని. ఆమె ఎక్కడ ఉంది? చాందిని ఏం చేస్తుంది? బతికుందా? లేదా? అని తెలుసుకోవాలని క్లాస్‌మేట్స్‌ ప్రయత్నిస్తారు. చాలా సస్పెన్స్ అన్నమాట. మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్రశ్న: నిర్మాతలు అచ్యుత రామారావు, రవితేజ మన్యం, అజయ్ మైసూర్ గురించి… 
అవికా గోర్: వెరీ నైస్ పీపుల్. వాళ్ళ నిర్మాణంలో కంఫ‌ర్ట్‌బుల్‌గా ఫీలయ్యాను. మేం చాలా లొకేషన్స్‌లో షూటింగ్ చేశారు. నేను చిక్ మంగుళూరులో చేశా. అయితే, సినిమాను శ్రీలంక, రాజమండ్రి, ఇంకా చాలా లొకేషన్స్‌లో చేశారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అంత మందితో సినిమా తీయడం ఎంత కష్టమో నిర్మాతగా నాకు తెలుసు.

ప్రశ్న: మీ మీద ఒక పాట తెరకెక్కించారు. సినిమాలో పాటల గురించి…
అవికా గోర్: ఏ సినిమాకు అయినా సరే పాటలు చాలా ముఖ్యం. ఎంతో వేల్యూ యాడ్ చేస్తాయి. సురేష్ బొబ్బిలి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ పాటలు ప్రేక్షకులు నచ్చాయి. నార్త్ ఇండియాలో నా ఫ్రెండ్స్ కూడా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ పాటలు వింటున్నారు. హార్ట్ టచింగ్ సాంగ్స్ అని చెబుతున్నారు.

ప్రశ్న: నటుడు శ్రీరామ్ గురించి…
అవికా గోర్: అమేజింగ్ యాక్టర్. మా మధ్య ఎక్కువ సీన్స్ లేవు. అయితే… ఆయనతో నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను. ఆయన ఎక్స్‌పీరియ‌న్స్‌లు చెప్పారు.

ప్రశ్న: ఎవరితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి?
అవికా గోర్: నా తండ్రి పాత్రలో నాజర్ గారు నటించారు. ఆయనతో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. సినిమాపై ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆయనతో మాట్లాడేటప్పుడు ఎంతో నేర్చుకున్నాను.

ప్రశ్న: దర్శకుడు అంజి గురించి…
అవికా గోర్: అంజి గారు చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. నటీనటుల నుంచి ఏం తీసుకోవాలో బాగా తెలుసు. సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ పరంగా బాగా తీశారు.

ప్రశ్న: సినిమాలు పక్కన పెట్టి… మీ వ్యక్తిగత జీవితానికి వస్తే మిళింద్‌తో మీరు ప్రేమలో ఉన్న విషయం తెలుసు. ఆయన పరిచయం తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి?
అవికా గోర్: నేను మరింత కాన్ఫిడెంట్‌గా  అయ్యాను. నా కేపబిలిటీ ఏంటి అనేది నాకు తెలిసింది. నేను ఏం చేయగలనో తెలిసింది. నేను ఆలోచిస్తున్న దానికంటే ఇంకా చాలా చేయగలని తెలుసుకునేలా చేశాడు. నేను బరువు తగ్గడం నుంచి నిర్మాతగా మారడం వరకూ… నా ప్రతి అడుగులో మిళింద్ ఉన్నాడు. నా ప్రయాణంలో నాకు అండగా నిలబడ్డాడు. అతడు లేకుండా నేను ఇదంతా చేయలేను.

ప్రశ్న: తెలుగు సినిమాలకు మధ్యలో గ్యాప్ రావడానికి కారణం ఏదో ఉందని రూమర్స్ వచ్చాయి. మీరేమంటారు?
అవికా గోర్: నేను హిందీ సీరియల్స్ చేస్తుండటం వల్ల తెలుగు సినిమాలు చేయలేకపోయా. అంతకు మించి ఏమీ లేదు. డేట్స్ లేక తెలుగు సినిమాలు చేయలేయకపోయా.

ప్రశ్న: జూన్ 30న మీ పుట్టినరోజు. బర్త్ డే ప్లానింగ్స్ ఏంటి?
అవికా గోర్: ప్రస్తుతానికి ఏమీ లేవు. జూలై 1న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ విడుదలవుతోంది కదా! వీలైతే ఒక్క రోజు ముందు… నా పుట్టిన రోజున అది చూడాలనుకుంటున్నా. వచ్చే నెలలో నేను నటించిన ‘థాంక్యూ’ విడుదల కానుంది. ఇంకా తెలుగులో సినిమా చేస్తున్నాను. ఆ సినిమాల గురించి మీకు చెప్పాలనుంది. పుట్టినరోజున అప్‌డేట్స్‌ రావచ్చు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #10th Class Diary’s
  • #Avika Gor

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

1 hour ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

2 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

2 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

18 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

3 hours ago
Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

15 hours ago
Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

18 hours ago
Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

19 hours ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version