శివరాత్రి హాలిడేని కళ్యాణ్ రామ్… క్యాష్ చేసుకున్నాడు..!

  • March 5, 2019 / 06:57 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘118’. కే.వి.గుహన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మార్చి 1 విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు ఈ చిత్రానికి పెద్ద ఓపెనింగ్స్ రాలేదు. అయితే మంచి మౌత్ టాక్ రావడంతో రెండు, మూడు రోజుల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక నిన్న శివరాత్రి సెలవు కావడంతో ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది. నిన్న ఒక్క రోజే ఈ చిత్రం కోటిన్నర వరకూ షేర్ ని వసూల్ చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసాడు. 11 కోట్ల ప్రీ – రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రానికి మొదటి నాలుగు రోజులకి గానూ 5.58 కోట్ల షేర్ వచ్చింది. ఇక ‘118’ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 2.48
సీడెడ్ – 0.87
నెల్లూరు – 0.13


కృష్ణా – 0.44
గుంటూరు – 0.45
వైజాగ్ – 0.63


ఈస్ట్ గోదావరి – 0.32
వెస్ట్ గోదావరి – 0.24
————————————————————
ఏపీ+తెలంగాణ – 5.58
(టోటల్)


————————————————————–

పరీక్షల సీజన్లో వచ్చినప్పటికీ ఈ చిత్రం మంచి కల్లెక్షన్లనే… నమోదు చేసింది. అయితే ఈరోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలుకానుంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్లు నమోదుచేయాల్సి ఉంది. ఇక ఈ శుక్రవారం కూడా పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి… ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. సో ఓవర్ ఆల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తే… ఈ సంవత్సరం ‘ఎఫ్2’ చిత్రం తరువాత హిట్ లిస్ట్ లో జాయిన్ అయ్యే చిత్రం ఇదే అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus