2022లో సౌత్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘విక్రమ్’, ‘కార్తికేయ 2’, ‘కాంతార’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేశాయి.. మూవీ లవర్స్‌ని ఆశ్చర్యపరచడమే కాక కొన్ని సీన్లు మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా థియేటర్లకు రప్పించాయి.. వేల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ కళ కళలాడేలా చేశాయి.. ట్రిపులార్ ఇంటర్వెల్‌లో భీమ్ క్యారెక్టర్ ఎంట్రీ.. ‘కేజీఎఫ్ 2’ లో ‘కలాష్నికోవ్’ రైఫిల్ సీన్ లాంటివి మతి పోగొట్టేశాయి.. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులు చేత పిచ్చ పీక్స్ అనిపించుకున్న 12 సీన్లు ఏంటనేవి ఇప్పుడు చూద్దాం..
1. ఆర్ఆర్ఆర్ – రామ్ చరణ్ ఇంట్రడక్షన్..
పవర్ ఫుల్ అండ్ ఫియర్‌లెస్, ఫైరీ కాప్ క్యారెక్టర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రో అదిరిపోతుంది.. అంత మంది జనాన్ని ఒక్కడు కంట్రోల్ చేయడమే అని రాజమౌళి ఆలోచన, టేకింగ్, చెర్రీ నటన, కీరవాణి నేపధ్య సంగీతం ఈ సన్నివేశాన్ని రక్తి కట్టించాయి..
2. ఆర్ఆర్ఆర్ – జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భీమ్ పాత్ర పులితో పోరాడే సీన్‌కి అందరూ నోరెళ్లబెట్టి చూస్తుండి పోయారు.. ముఖ్యంగా ఈ సన్నివేశంలో విజువల్స్, ముఖ్యంగా తారక్ హావభావాలు మంత్రముగ్దుల్ని చేసేస్తాయి.. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ అసలు.. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రో సీన్ ఇది..
3. విజయ్ సేతుపతి – విక్రమ్..
ఈ జెనరేషన్ సౌత్ స్టార్లలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అని కొత్తగా చెప్పక్కర్లేదు.. ‘విక్రమ్’ మూవీలో సంతానం ఎంట్రీ సీన్ సాలిడ్‌గా ఉంటుంది.. షర్ట్ లేకుండా అలా నడుచుకుంటూ వస్తూ విజయ్ పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ అరుపులు అసలు.. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది..
4. విక్రమ్ – ఘోస్ట్ మాస్క్ రివీలింగ్..
‘విక్రమ్’ ప్రీ ఇంటర్వెల్ చూస్తుంటే.. ఘోస్ట్ క్యారెక్టర్‌లో ఎవర్ని రివీల్ చేస్తారా? అనే సస్పెన్స్ నెలకొంది అందరిలో.. కట్ చేస్తే.. ‘విశ్వనటుడు’ కమల్ హాసన్.. ఎప్పుడైతే ముఖానికున్న మాస్క్ తీసి.. ‘ఇక మొదలెడదామా’ అనగానే.. అనిరుధ్ ఆర్ఆర్ రావడంతో దెెబ్బకి థియేటర్లు దద్దరిల్లిపోయాయ్.. ఎలివేషన్ షాట్స్ అయితే షాక్ ఇస్తాయి..
5. కేజీఎఫ్ – చాప్టర్ 2 : మిషన్ గన్ సీన్..
ట్రైలర్‌లో ఈ షాట్ చూసినప్పుడు జనాలకి మతి పోయింది.. ప్రశాంత్ నీల్ ట్రైలర్‌లోనే ఈ రేంజ్ రచ్చ రంబోలా ఎలివేషన్ ఇచ్చాడంటే.. ఇక సినిమా వేరే లెక్క ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.. రాకీ భాయ్ ఫైర్ చేసి రిలాక్స్డ్‌గా ఆ గన్ మంట నుండి సిగరెట్ వెలిగిస్తుంటే.. ఒక్కరూ సీట్లో కుదురుగా కూర్చోలేదు..
6. కేజీఎఫ్ – చాప్టర్ 2 : కలాష్నికోవ్ రైఫిల్..
మిషన్ గన్ సీనే మతి పోగొట్టింది అంటే.. ఇది దాని బాబు లాంటి సీన్ అనే చెప్పాలి.. కలాష్నికోవ్ రైఫిల్‌తో రాకీ విధ్వంసం సృష్టిస్తుంటే థియేటర్లలో జనాలు ఉలిక్కి పడ్డారు.. కళ్లప్పగించి, నోరెళ్లబెట్టి చూసేలా చేసిన బీభత్సమైన సీన్ ఇది..
7. ఆర్ఆర్ఆర్ – యానిమల్స్‌తో భీమ్ ఎంట్రీ..
ట్రిపులార్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో భీమ్.. యానిమల్స్‌తో ఎంట్రీ ఇవ్వడం చూసి ప్రేక్షకులు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురయ్యారు.. క్రూర జంతువులతో హీరో ఎంటర్ అవడం అనే ఆలోచనని పేపర్ మీద పెట్టడమే కష్టమనుకుంటే.. దాన్ని విజువల్‌గా, ఊహకందని విధంగా చూపించడం అంటూ మామూలు విషయం కాదు.. జక్కన్నకి ప్రపంచ సినీ ప్రియులు సలాం కొట్టడానికి ఈ సీన్ కూడా ఓ కారణం.. ఈ సంవత్సరంలోనే కాదు.. ఈ దశాబ్దంలోనే ఇది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పొచ్చు..
8. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ – అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్ చరణ్ ఎంట్రీ..
ఇంట్రోలోనే ఇరగదీసిన చరణ్.. క్లైమాక్స్‌లో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం కానీ.. చేసిన స్టంట్స్ కానీ అదిరిపోతాయి..
9. కాంతార క్లైమాక్స్ – రిషబ్ శెట్టి నటన..
రీసెంట్ సెన్సేషన్ ‘కాంతార’ గురించి తెలియని వారెవరూ ఉండరు.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి నటన అద్భుతం.. ముఖ్యంగా దేవుడు ఆవహించేటప్పుడు అతను పలికించి హావభావాలు మంత్ర ముగ్దుల్ని చేస్తాయి..
10. విక్రమ్ – రోలెక్స్‌గా సూర్య ఎంట్రీ..
‘విక్రమ్’ మూవీలో మరో అదిరిపోయే సాలిడ్ ట్విస్ట్ ఎవరూ ఊహించలేదు.. వెర్సటైల్ యాక్టర్ సూర్య ‘రోలెక్స్’ క్యారెక్టర్‌లో కనిపించి పిచ్చెక్కించేశారు.. క్లైమాక్స్‌కి పది నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి.. అప్పటి వరకు చూసిన సినిమా అంతా ఒక ఎత్తు.. రోలెక్స్ ఉన్న కాసేపు మరో ఎత్తు అనిపించారు.. తెరమీద కనిపించింది కాసేపే అయినా తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారు..
11. సీతా రామం క్లైమాక్స్..
ఈ మధ్య కాలంలో చూసిన పతాక సన్నివేశాల్లో ది బెస్ట్ క్లైమాక్స్ ‘సీతా రామం’.. ప్రేక్షకుల మనసులు తాకుతు.. హృదయాల్ని హత్తుకునేలా చేసిన సీన్ ఇది.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ తమ నటనతో సీతా, రామ్ పాత్రలకు ప్రాణం పోశారు.. రామ్.. తన ప్రేమని, బాధని తెలియజేసేలా రాసిన ఉత్తరంలో ‘ఈ జన్మకిక సెలవు’ అనే మాట వినగానే ప్రేక్షకులు కంటతడి పెట్టేశారు..
12. కార్తికేయ 2 – అనుపమ్ ఖేర్ కృష్ణుడి గొప్పతనం గురించి చెప్పడం..
ఇక మరో ముఖ్యమైన మెమరబుల్ అండ్ స్టోరీలో కీలకమైన సీన్.. అనుపమ్ ఖేర్ కృష్ణుడి గొప్పతనం గురించి చెప్పడం.. ఈ సీన్ చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. చాలా మంది ఈ సీన్ గురించి తెలిసుకుని మరీ సినిమాకి వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు..