Guntur Kaaram: ప్లాప్ కాంబినేషన్..కి ఈ రేంజ్లో డిమాండా?

Advertisement

2024 లో వచ్చే మొట్ట మొదటి బిగ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే కచ్చితంగా అది ‘గుంటూరు కారం’ అనే చెప్పాలి. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా.. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకుడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ సింగిల్’ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. యూట్యూబ్ లో అది మిలియన్ల వ్యూస్ నమోదు చేసింది.

సినిమాకి ఇంకా మైలేజ్ తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. మరోపక్క సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. అందరి దృష్టి ‘గుంటూరు కారం’ పైనే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ చిత్రం బిజినెస్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. ఈ చిత్రం (Guntur Kaaram) షూటింగ్ చివరి దశలో ఉండగానే అన్ని ఏరియాల నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్..

ఆంధ్ర రూ.50 కోట్ల రేషియో, నైజాం : 46 కోట్ల రేషియో, సీడెడ్ 15 కోట్ల రేషియో కట్టినట్టు తెలుస్తుంది. అంటే మొత్తంగా రూ.111 కోట్లన్న మాట. ఇది ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తంగా అది రూ.120 కోట్ల వరకు వెళ్లొచ్చు అని ట్రేడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న టాక్. అయితే సంక్రాంతి బరిలో ఇంకా క్రేజీ సినిమాలు ఉన్నాయి కాబట్టి.. ఈ రేషియోలో మార్పులు వస్తాయేమో చూడాలి

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus