OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

  • March 2, 2023 / 01:37 PM IST

శివరాత్రి వీకెండ్ ముగిశాక బాక్సాఫీస్ చాలా అంటే చాలా డల్ అయిపోయింది. చిన్న చితకా సినిమాలు తప్ప.. మంచి క్రేజ్ తెచ్చుకున్న పెద్ద, మిడ్ రేంజ్ సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. పైగా ఎగ్జామ్స్ సీజన్ కావడంతో యూత్ థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు అని గమనించిన కొన్ని చిత్ర బృందాలు తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అయితే ఓటీటీలో మాత్రం ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేదు. ఈ వీకెండ్ కు కూడా కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు టీవీ షోలతో సందడి గట్టిగానే ఉండబోతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 : ఈ సింగింగ్ ప్రోగ్రాం ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.

2) బుట్టబొమ్మ : మార్చి 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

3) ది గ్రేట్ ఇండియన్ కిచెన్ : ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది

4) అలోన్ : ఈ తెలుగు డబ్బింగ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

5) గుల్ మోహర్ : ఈ హిందీ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

6) ఇరట్ట : ఈ మలయాళ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

7) లవ్ ఎట్ ఫస్ట్ కిస్ : ఈ హిందీ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

8) తలైకూతల్ : ఈ తమిళ సినిమా సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

9) డివోర్స్ అటార్నీ సిన్ : ఈ కొరియన్ సిరీస్ మార్చి 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

10) మొనిక్ ఒలీవియర్: ఏక్ససరీ టూ ఈవిల్ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది

11) ఫ్రేమ్డ్! ఏ సిసిలియన్ మర్డర్ మిస్టరీ సీజన్ 2 : ఈ ఇటాలియన్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

12) మసామీర్ కౌంటీ సీజన్ 2 : ఈ హాలీవుడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

13)సెక్*స్/లైఫ్ సీజన్ 2 – ఈ హాలీవుడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది

14) ద క్రంచిరోల్ ఎనిమీ అవార్డ్స్ 2023 : ఈ హాలీవుడ్ టీవీ షో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus