Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

వరుస పరాజయాలతో సతమతమవుతున్న శర్వానంద్.. ఈ ఏడాది ఆరంభంలో ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ ఓ సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘బైకర్’ కూడా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు సంపత్ నంది వంటి మాస్ దర్శకుడితో ‘భోగి'(Bhogi) అంటూ ఈరోజు(నవంబర్ 27న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ సంస్థ కె.కె.రాధా మోహన్ ఈ చిత్రాన్ని శర్వానంద్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో నిర్మించారు.

Bhogi

వాస్తవానికి ఈ సినిమా నవంబర్ 12నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సమస్యలు తలెత్తడంతో రివైజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. ఎట్టకేలకు అన్ని సమస్యలు దాటుకుని.. ఈరోజు అంటే నవంబర్ 27న రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షోతోనే ఈ సినిమా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ రన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ‘భోగి’ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ను అలాగే మైనస్ పాయింట్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా ప్లస్ పాయింట్స్

1) భోగి కోర్ ఐడియా బాగుంది. ‘ఙ్ఞానం వెలుగవ్వాలి..! మంత్రం మందవ్వాలి..! నమ్మకం నలుగురి పానం నిలబెట్టాలి..! మన పెయ్యె గుడైనప్పుడు, పానమే దేవుడు..!’ ఇది ‘భోగి’తో దర్శకుడు సంపత్ నంది చెప్పాలనుకున్న పాయింట్.

2) సినిమా మొదటి 30 నిమిషాలు బాగుంది. తెలంగాణ నేటివిటీని, అది కూడా 1960’ల కాలం నాటి తెలంగాణ సంస్కృతిని కళ్ళకి కట్టినట్టు చూపించారు. పటేల్ వ్యవస్థని నేటి జెనెరేషన్ కి అర్దమయ్యేలా వివరించగలిగారు.

3) శర్వానంద్ మేకోవర్ బాగుంది. ‘ఈ జోనర్ నాకు కొత్త’ అని ఎక్కడా ‘టేక్ ఇట్ గ్రాంటెడ్’గా తీసుకోకుండా కష్టపడి చేశాడు. ప్రతి ఫ్రేమ్ లో శర్వానంద్ కష్టం కనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా శర్వానంద్ బాగా నటించాడు.

4) సెకండాఫ్ లో అనుపమ పాత్రని న*గ్నంగా నిలబెట్టాలని విలన్ మనిషి వేధిస్తున్న టైమ్లో డింపుల్ హయాతి పాత్ర ఎంట్రీ ఇచ్చి.. అతనికి కౌంటర్ ఇచ్చే సన్నివేశం బాగుంది.

5) ప్రొడక్షన్ డిజైన్ టీమ్ పనితనం కూడా బాగుంది. 1960ల నాటి తెలంగాణాని చూస్తున్నప్పుడు టైమ్ ట్రావెల్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. మిగతా టెక్నికల్ టీమ్ కూడా కష్టపడి పనిచేసింది.

మైనస్ పాయింట్స్ 

6) ఓ కమర్షియల్ మాస్ సినిమాకి కావాల్సిన సెటప్ అంతా ‘భోగి’లో ఉంది. కానీ పూర్తిగా మైనస్ గా మారిన అంశాల్లో డైరక్షన్ మెయిన్ అని చెప్పాలి. అవును సంపత్ నంది మార్క్ స్క్రీన్ ప్లే పూర్తిగా లోపించిన సినిమా ఇది. ‘రంగస్థలం’ వంటి ఎమోషనల్ డ్రామా తీయాలనే తపనతో ‘భోగి’ కథని ఎంపిక చేసుకున్నాడు సంపత్ నంది. స్వతహాగా అతను తెలంగాణా రాష్ట్రనికి చెందిన వ్యక్తి కావడంతో.. బ్యాక్ గ్రౌండ్ కూడా అదే తీసుకున్నాడు. కానీ ‘రంగస్థలం’ కి వర్కౌట్ అయిన ఎమోషన్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు.

7) మొదటి అరగంట తర్వాత సినిమా పూర్తిగా ట్రాక్ తప్పుతుంది. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రీ ఇంటర్వల్ బ్లాక్ కే కథ మొత్తం అయిపోతుంది. అక్కడి నుండీ ప్రీ క్లైమాక్స్ వరకు సాగధీతే. పోనీ అక్కడైనా డ్రామా పండిందా అంటే లేదు. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ బ్లాక్స్ వస్తుంటాయి.. వాటితో పాటు శృతిమించిన హింస.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

8) సాధారణంగా ఇలాంటి సినిమాల్లో విలన్ ట్రాక్ పవర్ఫుల్ గా ఉండాలి. కానీ ఈ సినిమాలో విలన్ ఎంత వీక్ అనేది సెకండాఫ్ స్టార్టింగ్లోనే ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి.. అతను పార్ట్ టైమ్ విలన్ ని చేసేసి.. ఆ పాత్రని కూడా పాతాళానికి తోక్కెసినట్టు అయ్యింది.

9) డింపుల్ హయాతి పోషించిన మందారం పాత్రకి రిలీజ్ కి ముందు భారీ హైప్ ఇచ్చారు. ఆమె కూడా వేరే సినిమా ఆఫర్ ను వదులుకుని మరీ ఈ పాత్రని ఎంపిక చేసుకున్నట్టు చెప్పింది. కానీ ఆమె పూర్తిగా వ్యాంప్ పాత్రని ఎంపిక చేసుకుంది. హీరోయిన్ గా చేస్తూ ఇలాంటి పాత్ర ఎలా ఎంపిక చేసుకుందో ఆమెకే తెలియాలి.

10) భీమ్స్ సంగీతం కూడా ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. ఒకటి, రెండు పాటలు మినహా.. ఎక్కడా డ్యూటీ చేసినట్టు లేదు. మాస్ సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో, సీన్ మూడ్ కి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోతే.. ఎంత డ్యామేజ్ జరుగుతుందో? చెప్పడానికి ‘భోగి’ పెద్ద ఉదాహరణ.

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus