2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా ఈ రెండు నియోజకవర్గాల్లో అనుకూల ఫలితాలు రాలేదు. పవన్ కళ్యాణ్ కు భారీ స్థాయిలో ఓట్లు వచ్చినా గెలిచే స్థాయిలో అయితే ఓట్లు రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ ను ఓడించటానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ పోసాని షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఈ మొత్తం ఖర్చు చేసిందని పోసాని కృష్ణమురళి అన్నారు.
భీమవరంలో పవన్ ఓడిపోవటానికి చంద్రబాబు కారణమని ఆయన కామెంట్లు చేశారు. పవన్ జనసేన పార్టీని స్థాపించిన సమయంలో నేను సాదరంగా ఆహ్వానించానని ఆ పవన్ ఇప్పుడు లేడని పోసాని తెలిపారు. పవన్ కు ఓట్లు వేయవద్దని టీడీపీ వాళ్లు డబ్బులు పంచారని కావాలంటే పవన్ విచారణ చేసుకోవాలని పోసాని అన్నారు. పవన్ పై ఇప్పటికీ నాకు గౌరవం ఉందని పవన్ టీడీపీ వలలో పడవద్దని ఆయన కామెంట్లు చేశారు.
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంది. పవన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. పవన్ బ్రో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ఓజీ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సగం షూటింగ్ పూర్తైంది.
హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ లు మాత్రం కొంతమేర ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ విషయంలో పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో (Pawan Kalyan) పవన్ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!
ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!