Jawan: ‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ దాదాపు 10 ఏళ్ళ తర్వాత ‘పఠాన్’ తో హిట్టు కొట్టి సూపర్ ఫామ్లోకి వచ్చాడు. ఈ క్రమంలో అతని నుండి రాబోతున్న మరో మూవీ ‘జవాన్’. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. హై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్’ బ్యాన‌ర్ స‌మర్ప‌ణ‌లో గౌరీ ఖాన్ నిర్మాత‌గా జ‌వాన్ రూపొందుతుండగా గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది.

ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ మేకర్స్ ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటారు అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను రెట్టింపు ఉత్సాహంతో మొదలుపెట్టింది ‘జవాన్’ టీం. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను ‘జవాన్’ ప్రివ్యూ పేరుతో రిలీజ్ చేసింది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. 2 నిమిషాల 12 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చాలా వరకు అట్లీ గత సినిమాలను తలపించేలా ఉంది అని కొందరు అంటుంటే..

మరికొంత మంది సౌత్ లో రూపొందిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల విజువల్స్ ఈ సినిమాలో కనిపిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. అట్లీ గురువు శంకర్ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ సినిమాతో పాటు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ లో ఉన్న కొన్ని విజువల్స్ కూడా కనిపించాయి అనే కామెంట్స్ మొదలయ్యాయి. ఇక (Jawan) ‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus