ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!

సినిమా తీయడం కష్టం. కానీ రిలీజ్ చేయడం ఇంకా చాలా కష్టం. అందుకే ఎన్నో సినిమాలు ల్యాబ్స్ లో పడుంటున్నాయి. ఒకప్పుడు అంటే ఓటీటీలు వంటివి లేవు. అయితే థియేటర్లలో రిలీజ్ చేసుకోవాలి… లేదా శాటిలైట్ హక్కులు అమ్ముకోవాలి. అందుకు చాలా పోటీ ఉండేది. ఇప్పుడైతే సినిమాని రిలీజ్ చేసుకోవడానికి బోలెడన్ని సోర్సులు వచ్చాయి. మంచి రేటు వస్తే నేరుగా ఓటీటీ రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నది చిన్న సినిమాల గురించి. కానీ ఇంకో విషయం తెలుసా..?

ఎందుకో కొన్ని పేరున్న సినిమాలు ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అందుకు కారణాలు ఏంటో తెలీదు. వాటి గురించి మేకర్స్ కూడా పట్టించుకోవడం లేదు. ‘ఆ సినిమాలు రాకపోతేనే మంచిది’ అన్నట్టు లైట్ తీసుకున్నారు. గతంలో కొంతమంది హీరోలు నటించిన సినిమాలు.. వాళ్లకి కొంత క్రేజ్ వచ్చిన తర్వాత ‘అవి రిలీజ్ కాకుండా ఉంటే బాగుణ్ణు’ అని ప్రయత్నించినట్టు ప్రచారం జరిగింది. ఇందుకు ఉదాహరణగా రవితేజ చేసిన ‘అన్వేషణ’ గురించి చెప్పుకోవచ్చు. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ ‘ఇడియట్’ వంటి సినిమాలతో రవితేజ మంచి ఫామ్లో ఉన్నప్పుడు..

వీటికి ముందు రవితేజ చేసిన ‘అన్వేషణ’ అనే చిత్రాన్ని దర్శకుడు సాగర్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. అందుకు రవితేజ వద్దని చెప్పాడు. అయినా సాగర్ రిలీజ్ చేయడం జరిగింది. రవితేజకి సినిమా బ్యాక్ గ్రౌండ్ కనుక ఉండుంటే ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆపుండేవాడేమో. కానీ ఆపలేకపోయాడు.అయితే ఇలాంటి కారణాలతో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి అన్నది వాస్తవం. ఇదిలా ఉండగా.. ఏళ్ళు గడిచినా ఇప్పటికీ రిలీజ్ కాని కొన్ని సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) శాంతి నివాసం:

చిరంజీవి హీరోగా మాధవి హీరోయిన్‌గా రూపొందిన సినిమా ఇది. బాబు అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పంటకు కూడా పూర్తయ్యాయి. కానీ ఓ నిర్మాత మరణంతో ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది.

2) భీమ :

చియాన్ విక్రమ్ హీరోగా త్రిష హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ కాలేదు.

3) జాదు :

‘7 /జి బృందావన కాలనీ’ ఫేమ్ రవి కృష్ణ హీరోగా ఇలియానా, తమన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2007 లో రిలీజ్ కావాల్సి ఉంది. తమిళంలో కేడి పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులో మాత్రం రిలీజ్ కాలేదు.

4) ఇంటింటా అన్నమయ్య :

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2013-14 లో రిలీజ్ కావాల్సిన మూవీ. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.

5) డీకే బోస్ :

సందీప్ కిషన్, నిషా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ కూడా 2013-14 టైంలో రిలీజ్ కావాల్సింది. కానీ రిలీజ్ కాలేదు.

6) కోతి కొమ్మచ్చి :

దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా .. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2020 లో రిలీజ్ కావాలి. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.

7) దటీజ్ మహాలక్ష్మీ :

తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో సూపర్ హిట్ అయిన ‘క్వీన్’ కి రీమేక్. 2019 లో ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.

8) అయినా ఇష్టం నువ్వు :

నరేష్ కొడుకు నవీన్, కీర్తి సురేష్(ఫస్ట్ మూవీ) జంటగా నటించిన ఈ సినిమా 2016 లో రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.

9) ధృవ నక్షత్రం :

విక్రమ్, ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 2016 లో రిలీజ్ కావాల్సింది. కానీ ఇంకా రిలీజ్ కాలేదు.

10) నా పేరు శివ2 :

కార్తి హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 2014 వచ్చిన ‘మద్రాసి’ చిత్రాన్ని తెలుగులో ‘నా పేరు శివ 2’ పేరుతో రిలీజ్ చేస్తున్నట్టు 2022 ఆరంభంలో ప్రకటించారు. కానీ ఆ సినిమా (Movies) రిలీజ్ కాలేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus