Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » 2021లో అత్యథిక కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!

2021లో అత్యథిక కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!

  • December 28, 2021 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2021లో అత్యథిక కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!

2020 చివర్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో మూసుకున్న థియేటర్లు తెరుచుకున్నాయి. ఆ చిత్రం ఇచ్చిన ఊపుతో 2021 సంక్రాంతి బరిలో ‘క్రాక్’ ‘రెడ్’ ‘అల్లుడు అదుర్స్’ వంటి 4 మిడ్ రేంజ్ సినిమాలు విడుదలై ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాయి.’మాస్టర్’ వంటి డబ్బింగ్ సినిమా కూడా విడుదలయ్యి వీటికి మంచి పోటీని ఇచ్చింది. దాంతో టాలీవుడ్ తొందరగానే కోలుకున్నట్టు కనిపించింది. ఫిబ్రవరి, మార్చిలో కూడా బ్లాక్ బస్టర్లు పడ్డాయి. ఇండియాలో మరే సినీ పరిశ్రమ కోలుకోని విధంగా టాలీవుడ్ కోలుకుంది. ఏప్రిల్ లో ‘వకీల్ సాబ్’ వంటి పెద్ద సినిమా కూడా విడుదలైంది. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన 3 వారాలకే మళ్ళీ థియేటర్లు మూతపడ్డాయి. విడుదలకి సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యాయి.

జూలైలో థియేటర్లు మళ్ళీ తెరుచుకున్నప్పటికీ.. పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి 5 నెలల వరకు టైం పట్టింది. డిసెంబర్ లో ‘అఖండ’ ‘పుష్ప’ ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇదిలా ఉండగా… ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యథిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) పుష్ప :

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూడో చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ.120.35 కోట్ల షేర్ ను రాబట్టి ఈ ఏడాదికి అత్యథిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. అయితే ఫుల్ రన్లో ఎంత వరకు రాబడుతుందో చూడాలి.

2) వకీల్ సాబ్ :

Pawan Kalyan's Vakeel Saab Movie First Look Talk1

పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ అయిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.85.61 కోట్ల షేర్ ను రాబట్టి ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది.

3) అఖండ :

బాలయ్య- బోయపాటి ల హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 25 రోజులకి గాను వరల్డ్ వైడ్ గా రూ.68.97 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంతవరకు రాబడుతుందో చూడాలి.

4) ఉప్పెన :

వైష్ణవ్ తేజ్- కృతిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.51.52 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అప్పటి వరకు ఫిబ్రవరి నెలకి హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ‘మిర్చి’ ఉండేది. ‘ఉప్పెన’ ఆ రికార్డుని బ్రేక్ చేసింది.

5) క్రాక్ :

రవితేజ- గోపీచంద్ మలినేని ల హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.39.16 కోట్ల షేర్ ను రాబట్టి.. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.

6) జాతి రత్నాలు :

నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ రన్లో ఏకంగా రూ.38.52 కోట్ల షేర్ ను రాబట్టి.. ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7) లవ్ స్టోరీ :

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.35.16 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ లిస్ట్ లో చేరింది.

8)మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ :

అఖిల్- బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ. 23.75 కోట్ల షేర్ ను రాబట్టి కమర్షియల్ హిట్ గా నిలిచింది.

9) శ్యామ్ సింగ రాయ్ :

నాని హీరోగా రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 4 రోజులకి గాను రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.25కోట్ల పైనే షేర్ ను రాబట్టి హిట్ లిస్ట్ లోకి చేరే అవకాశం ఉంది.

10) రెడ్ : 

Hero Ram's RED Movie pre-release business1

రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై రూ.19.79 కోట్ల షేర్ ను రాబట్టి.. కమర్షియల్ హిట్ గా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Jathi Ratnalu
  • #Krack
  • #Pushpa
  • #RED

Also Read

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

14 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

24 mins ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

49 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version