2023 లో డిజాస్టర్ అయిన టాలీవుడ్ సినిమాలు ఇవే!

మరికొన్ని రోజులలో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పబోతున్నటువంటి తరుణంలో ఈ ఏడాదిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగినటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించినటువంటి వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఏడాది ఇండస్ట్రీలోకి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తూ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నటువంటి సినిమాలు గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఏడాది ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచినటువంటి తెలుగు సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా చిరంజీవి ఎప్పుడు కూడా సాధించలేనటువంటి డిజాస్టర్ కలెక్షన్లను సాధించి ఘోరంగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ప్రేక్షకులకు మాత్రం తీవ్రమైన నిరాశ తప్ప లేదని చెప్పాలి.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ (Adipurush) సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా చూసినటువంటి ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా పట్ల విమర్శలు కురిపించారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది దీంతో ప్రభాస్ ఖాతాలో మరో డిజాస్టర్ సినిమా చేరిపోయింది.

అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి అఖిల్ ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయారు కానీ ఈ ఏడాది ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తప్పకుండా అఖిల్ కెరియర్ మార్చేస్తుందని అందరూ భావించారు కానీ ఈ సినిమా తక్కువ కలెక్షన్లను రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.

ఇక అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా ఈ ఏడాది కస్టడీ సినిమా ద్వారా తెలుగు తమిళ భాషలలో విడుదలయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇలా తెలుగు తమిళ భాషలలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా రెండు భాషలలో ప్రేక్షకులను నిరాశపరిచింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus