Extra Ordinary Man Review in Telugu: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నితిన్ (Hero)
  • శ్రీలీల (Heroine)
  • రాజశేఖర్, రావు రమేష్, సంపత్, సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు (Cast)
  • వక్కంతం వంశీ (Director)
  • ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి (Producer)
  • హారిస్ జయరాజ్ (Music)
  • ఆర్థర్ ఎ. విల్సన్, జె.యువరాజ్, సాయి శ్రీరామ్ (Cinematography)
  • Release Date : డిసెంబర్ 08, 2023

నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్”. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. మరి సినిమా కూడా అదే స్థాయిలో అలరించిందో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పట్నుంచి తన చుట్టుపక్కల వారి జీవితాల్లో పరకాయ ప్రవేశం చేయడం అలవాటుగా పెరిగి.. పెద్దయ్యాక సినిమాల్లో హీరోగా ప్రయత్నిస్తూ, బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడానికి పడరానిపాట్లు పడుతూ ఉంటాడు అభినయ్ (నితిన్). కట్ చేస్తే.. లిఖిత (శ్రీలీల) అభినయ్ లైఫ్ లోకి ప్రవేశిస్తుంది. అభినయ్ కి ఉద్యోగం ఇచ్చి మరీ తన పక్కనే ఉండేలా చూసుకొని ప్రేమిస్తుంటుంది. అంతా సెటిల్ అనుకుంటున్న తరుణంలో ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి తన దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది, నువ్వే హీరో అంటాడు అభినయ్ తో.

అక్కడి నుంచి అభినయ్ లైఫ్ ఎలా మారింది? తనకు ఇష్టమైన నటన కోసం ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? హీరోలా నటించడానికి ప్రయత్నిస్తూ విలన్ లకు ఎందుకు ఎదురెళ్ళాడు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమా.

నటీనటుల పనితీరు: నితిన్ ఎప్పట్లానే స్టైలిష్ గా, క్రేజీ డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నాడు. నితిన్ క్యారెక్టరైజేషన్ కాస్త కొత్తగా ఉంది. ఇండస్ట్రీకి చెందిన లేదా ఇండస్ట్రీకి గురించి తెలిసిన వ్యక్తులు ఈ పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. మరీ ముఖ్యంగా బ్యాగ్రౌండ్ ఆర్టిస్టులందరూ గట్టిగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది. శ్రీలీల మళ్ళీ మూడు పాటలు, నాలుగు సన్నివేశాలకు పరిమితమైపోయింది. క్యూట్ గా కనిపించి కానీ.. నటిగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆమె అర్జెంటుగా చిన్న బ్రేక్ తీసుకుంటే మంచిది. లేదంటే జనాలకు మోనాటనీ వచ్చేసి ఆమె భవిష్యత్ చిత్రాలపై ఆ దెబ్బ పడే అవకాశం ఉంది.

రాజశేఖర్ ఈ చిత్రంలో తనకు బాగా అలవాటైన యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించారు. రావు రమేష్ ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ క్యారెక్టర్ లో జీవించేశాడు. నితిన్-రావు రమేష్ క్యారెక్టర్ నడుమ వచ్చే సన్నివేశాలు మరియు సంభాషణలు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. సెల్వమణి అలియాస్ శివమణి అనే పాత్రలో సంపత్ నటన & బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి.

సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమాకి ముగ్గురు సినిమాటోగ్రాఫర్స్.. ముగ్గురూ మంచి అవుట్ పుట్ అందించారు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ను బాగా ఎలివేట్ చేశారు. హారిస్ జైరాజ్ పాటలు ఆల్రెడీ జనాల్లోకి వెళ్లిపోయాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఆయన ఇచ్చిన చిన్నపాటి రెట్రో టచ్ బాగుంది. దర్శకుడు మరియు కథకుడు వక్కంతం వంశీ రాసుకున్న స్క్రీన్ ప్లే కాస్త డిఫరెంట్ గా ఉంది. అక్కడక్కడా జనాలు కన్ఫ్యూజ్ అవుతారు కూడా.

అయితే.. హీరో & విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం బాగా రాసుకున్నాడు. విలన్ కి ముందు వార్నింగ్ ఇచ్చి.. ఆ తర్వాత దాని ఆర్డర్ మార్చుకోమని విలన్ కే చెప్పే సీన్ బాగా వర్కవుటయ్యింది. కథకుడిగా వంశీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే.. దర్శకుడిగా మాత్రం ఇంకాస్త బెటర్ టేకింగ్ ఉంటే బాగుండేది.

విశ్లేషణ: సరదా సన్నివేశాలు & సంభాషణలు, మంచి ఇంట్రెస్టింగ్ గా సాగే స్క్రీన్ ప్లే, నితిన్ నటన, శ్రీలీల డ్యాన్సుల కోసం హ్యాపీగా ఒకసారి చూడదగ్గ చిత్రం (Extra Ordinary Man) “ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్”

రేటింగ్: 2.75/5

Click Here to Read in ENGLISH

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus