2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయో కచ్చితంగా చెప్పలేం. రిలీజ్ డేట్ ప్రకటించినా.. ఆ డేట్ కి వస్తుందన్న గ్యారెంటీ లేదు. పండుగ సీజన్లలో స్టార్ హీరోల సినిమాలు ఉంటే బాగుంటుంది. కానీ సంక్రాంతి సీజన్లో స్టార్ హీరోల సినిమాలతోనే పనిలేదు. ఆడియన్స్ ని ఆకట్టుకునే జోనర్లో సినిమా వస్తే సరిపోతుంది. బాక్సాఫీస్ బద్దలైపోతుంది. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ పక్కన నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు.

2027 Sankranthi

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ పక్కన వెంకీ ‘ఎఫ్ 2’ అంటూ వచ్చి విన్నర్ గా నిలిచారు. ‘గేమ్ ఛేంజర్’ పక్కన వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా అంతే. చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ పక్కన వచ్చిన ‘ది రాజాసాబ్’ నిలబడలేదు. బాలయ్యకి అయితే సంక్రాంతి సీజన్ మినిమమ్ గ్యారెంటీ. అందుకే సీనియర్లంతా 2027(2027 Sankranthi) సంక్రాంతి పై కన్నేశారు.

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి – బాబీ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. దీన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. తర్వాత అనిల్ రావిపూడి- వెంకటేష్ సినిమా కూడా సంక్రాంతి టార్గెట్ గా రూపొందుతోంది. ఇక బాల‌య్య – గోపీచంద్ మలినేని కాంబోలో ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కూడా 2027 సంక్రాంతినే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

మరోపక్క నాగార్జున ఓ పక్క తన 100వ సినిమాలో నటిస్తూనే మరోపక్క కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఆ సినిమాని ఫాస్ట్ గా తెరకెక్కించి 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఇవన్నీ కూడా మినిమమ్ గ్యారెంటీ ప్రాజెక్టులే. సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని, మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే సరిపోతుంది. కామెడీ కూడా ఉంటే.. అదనపు ఆకర్షణ.

అందువల్ల ఈ నలుగురు అగ్ర హీరోలు కనుక వస్తే.. వేరే సినిమాలు ఎంట్రీ ఇవ్వడానికి కూడా భయపడతాయి అనడంలో సందేహం లేదు.

నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus