21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే
- October 1, 2026 / 11:28 PM ISTByPhani Kumar
‘వర్షం’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్..కి ఆ తర్వాత ‘అడవి రాముడు’ ‘చక్రం’ వంటి డిజాస్టర్లు ఎదురయ్యాయి. దీంతో ప్రభాస్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాంటి టైమ్లో రాజమౌళి దర్శకత్వంలో ‘ఛత్రపతి'(Chatrapathi) అనే సినిమా చేశాడు ప్రభాస్. శ్రియ ఈ చిత్రంలో హీరోయిన్ కాగా ప్రభాస్ కి తల్లి పాత్రలో భానుప్రియ నటించారు.
Chatrapathi Collections
మొదట్లో ఈ సినిమాపై బజ్ లేదు. మౌత్ టాక్ పై ఆదారపడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఛత్రపతి’. అయితే మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

ప్రభాస్ ఇంట్రో సీన్ కానీ, కాట్ రాజ్ ఫైట్, బాజీ రావ్ ఫైట్, ఇంటర్వల్ సీక్వెన్స్ వంటివి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది ‘ఛత్రపతి’. ఈ సెప్టెంబర్ 30కి ‘ఛత్రపతి’ రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తిక్వస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 5.58 cr |
| సీడెడ్ | 2.54 cr |
| ఉత్తరాంధ్ర | 1.66 cr |
| ఈస్ట్ | 1.08 cr |
| వెస్ట్ | 0.93 cr |
| గుంటూరు | 1.27 cr |
| కృష్ణా | 1.11 cr |
| నెల్లూరు | 0.73 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.90 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.45 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 16.35 cr |
‘ఛత్రపతి’ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.10.2 కోట్లు. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.16.35 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా ఆల్మోస్ట్ రూ.30 కోట్ల వరకు వసూల్ చేసింది. మొత్తంగా ఈ సినిమా బయ్యర్లకి రూ.6.15 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. అలాగే 54 కేంద్రాల్లో ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది.
తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..















