25 న విడుదలవుతున్న ‘24 ఆవర్స్’

భానుచందర్ ,తిలక్ ,నేత్ర , శివ సాయి ,నీలు ప్రసాద్ ,రఘు ప్రధాన పాత్రల్లో చిన్నా దర్శకత్వంలో కీర్తన మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ జ్యోతి వెంకటేష్ యాదవ్ నిర్మించిన చిత్రం ‘24 ఆవర్స్’ అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25 న సినిమా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత శివజ్యోతి వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ‘’యాక్షన్ , థ్రిల్లర్ గా మా చిత్రాన్ని నిర్మించాం . ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రానికి, సెన్సార్ సభ్యులు అభినందనలు తెలిపారు. వారి అభినందనలతో మా చిత్రం పై మరింత నమ్మకం ఏర్పడింది . ఈ చిత్రాన్ని ఈ నెల 25 న యశస్విని ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు . భానుచందర్ , తిలక్ ల నటన హైలైట్ గా నిలుస్తుంది .

భానుచందర్ ,తిలక్ ,నేత్ర , శివ సాయి ,నీలు ప్రసాద్ ,రఘు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా : విమల్ దిలీప్ , సంగీతం :రాజ్ కుమార్ , జీవన్ , ఎడిటింగ్ : బి . శ్రీనివాస్. నిర్మాత: శివజ్యోతి వెంకటేష్ యాదవ్, దర్శకత్వం: చిన్నా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus