మనం.. ఇంకా చాలా రోజులు ఉన్న సంక్రాంతి గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. కోలీవుడ్‌లో ఓ అదిరిపోయే క్లాష్ రెడీ అయింది. అది కూడా ఎప్పటికో కాదు. రాబోయే దీపావళికే. నిన్న మొన్నటి వరకు దీపాల పండగకు ఒక సినిమా మాత్రమే రెడీగా ఉంది అనుకుంటుండగా.. ఇప్పుడు మరో రెండు సినిమాలు యాడ్ అయ్యాయి. దీంతో ఈ సంవత్సరం దీపావళిగా అదిరిపోబోతోంది అనే చర్చ మొదలైంది. కోలీవుడ్‌లో అంటే ఆ సినిమాలు మన దగ్గర కూడా వస్తాయి కాబట్టి టాలీవుడ్‌లో కూడా ఆ సందడి మనం చూడొచ్చు.
దీపావళి నవంబర్ 8న ఆదివారం రాబోతోందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ముందు వారంలో వచ్చే శుక్రవారం నాడే సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆ లెక్కన నవంబర్ 6వ తేదీన సినిమాలు వరుస కడుతున్నాయి. తొలుత ఈ తేదీని ప్రకటించిన సినిమా ‘రామాయణ్: పార్ట్ 1’. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఈ పాన్-ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
రీసెంట్ రెండు హిట్‌లు కొట్టి.. హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్న సూర్య.. నవంబర్ 6న ‘సీన్’ సినిమాతో రాబోతున్నాడు. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ చూశాక అంచనాలు డబుల్ అయ్యాయి. ట్రైలర్ వచ్చాక ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంది. రెండు వరుస విజయాలు అందుకున్న హీరో కదా. లేటెస్ట్‌గా మరో సినిమా దీపావళికి రెడీ అవుతున్నట్లు ప్రకటించింది. ఇది హీరోయిన్ ఓరియెటెడ్ సినిమా.
‘మూకుత్తి అమ్మన్’ అంటూ కరోనా – లాక్‌డౌన్ టైమ్‌లో వచ్చి అదిరిపోయే విజయం అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. నయనతార హీరోయిన్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమాను సుందర్ సి తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ రిలీజ్ చేసి ఈ సినిమా టీజర్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ సినిమాలో తెలుగులోకి ‘అమ్మోరు తల్లి 2’గా రాబోతోంది.