స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా క్రేజ్ అందుకుంటున్న అల్లు అర్జున్ నెక్స్ట్ పుష్ప రాజ్ గా రాబోతున్న విషయం తెలిసిందే. బన్నీ కెరీర్ లోనే అత్యదిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్ కూడా ఉండబోతున్నట్లు క్లారిటీ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. రన్ టైమ్ అనుకున్న దానికంటే మరీ ఎక్కువ కావడంతో రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వడం డైరెక్టర్ హీరోకు ఆర్థికంగా బాగా హెల్ప్ అయినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా బన్నీ డబుల్ రెమ్యునరేషన్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదట ఒక పార్ట్ మాత్రమే అనుకున్నప్పుడు 30కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్ వచ్చింది. ఇక 80% షూటింగ్ అనంతరం రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకోవడంతో పారితోషికం 50కోట్ల వరకు వచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు రెండు భాగాలకు కలిపి ఏకంగా 70కోట్లని టాక్ వస్తోంది. సినిమా మార్కెట్ పెరగడం వల్లే బన్నీ ఈ స్థాయిలో డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.
మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక బన్నీ బాలీవుడ్ లో డైరెక్ట్ సినిమా చేసేందుకు కూడా చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!