గతంలో తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ గా చెప్పుకునే వారు. కానీ 2014లో ఆంధ్ర, తెలంగాణగా విపిపోయాయి. అయినప్పటికీ సినీ పరిశ్రమ ప్రస్తుతం తెలంగాణలో.. అంటే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లోనే ఉంది. సరే మెయిన్ పాయింట్ కు వస్తే టాలీవుడ్లో రాణించే వారిలో ఎక్కువ మంది దర్శకులు,కమెడియన్లు, స్టార్ హీరోలు ఆంధ్రప్రదేశ్ కు చెందినవాళ్ళే ఉండేవారు.తెలుగు సినిమా పరిశ్రమలో రాణిస్తున్న వారిలో ఎక్కువ మంది గోదావరి, కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళే ఉన్నారు అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే గత కొన్నేళ్ళుగా తెలంగాణకు చెందిన వారు కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లలో 10 మంది వరకూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే కావడం విశేషం. ఆ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) సురేందర్ రెడ్డి:
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఇతని సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఈ టాప్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడే కావడం విశేషం.
2) వంశీ పైడిపల్లి:
బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి.. వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు కూడా తెలంగాణ కు చెందిన వ్యక్తే కావడం విశేషం.
3) సంపత్ నంది:
‘రచ్చ’ ‘బెంగాల్ టైగర్’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సంపత్ కూడా తెలంగాణ చెందిన వ్యక్తే.
4) హరీష్ శంకర్:
మనుషుల్ని మాటలతో కొట్టడంలో ఇతనికి ఎవ్వరూ సాటి రారు. ఇతను కూడా తెలంగాణ కుర్రాడే.
5) తరుణ్ భాస్కర్:
తెలంగాణ కుర్రాళ్ళలో మంచి జోష్ నింపే సినిమాలు చేస్తుంటాడు. ఇతను పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే..!
6) సందీప్ రెడ్డి వంగా:
‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ కూడా తెలంగాణ కుర్రాడే..!ఇప్పుడు బాలీవుడ్లో కూడా రాణిస్తున్నాడు.
7) దశరథ్:
‘సంతోషం’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన దర్శకుడు దశరథ్ కూడా తెలంగాణ కు చెందిన వ్యక్తే..!
8) నాగ్ అశ్విన్:
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన నాగ్ అశ్విన్ కూడా తెలంగాణ కుర్రాడే..! ప్రస్తుతం ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేసేస్తున్నాడు.
9) సంకల్ప్ రెడ్డి:
‘ఘాజీ’ ‘అంతరిక్షం’ వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్ కూడా తెలంగాణకు చెందిన కుర్రాడే..!
10) వేణు ఉడుగుల:
‘నీదీ నాదీ ఒకే కథ’ వంటి ఎమోషనల్ మూవీని తెరకెక్కించి హిట్ అందుకున్న దర్శకుడు వేణు ఉడుగుల.. ఇప్పుడు రానాతో ‘విరాటపర్వం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇతను పుట్టి పెరిగింది తెలంగాణలోనే..!