గతేడాది కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. దాంతో విడుదల కావాల్సిన సినిమాలకు ఎదురు దెబ్బ తగిలినట్టు అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లు తెరుచుకున్నా.. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కు మళ్ళీ మూతపడ్డాయి. దాంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చిందని చెప్పాలి.ఇదిలా ఉండగా.. కొంతమంది డైరెక్టర్లకు గతేడాదికి ముందే బడా ఆఫర్లు వచ్చాయి. వాళ్ళందరూ గత సినిమాలతో హిట్లు కొట్టిన వాళ్ళే. కానీ వీళ్ళు మొదలుపెట్టిన ఆ పెద్ద సినిమాలకు మాత్రం ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. ఈ ఏడాది అయినా ఈ డైరెక్టర్ల సినిమాలు విడుదలవుతాయ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు..? అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
1) సుకుమార్:
2018 లో ‘రంగస్థలం’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. తరువాత బన్నీ తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు. ఇది రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఈ ఏడాది మొదటి పార్ట్ విడుదలవుతుందా అనేది అనుమానమే?
2) కొరటాల శివ:
2018 లో ‘భరత్ అనే నేను’ తో హిట్ కొట్టాడు. తరువాత మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మొదలుపెట్టాడు. విడుదల తేదీ అనౌన్స్ చేశారు కానీ ఈ ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది అనే గ్యారెంటీ లేదు.
3) వంశీ పైడిపల్లి:
2019 లో ‘మహర్షి’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించాడు. తరువాత 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాడు. తరువాతి ఈ సినిమా విజయ్ తో అంటున్నారు. కచ్చితంగా ఈ ఏడాది అయితే ఇతని నుండీ సినిమా వచ్చే అవకాశం లేదనే చెప్పాలి.
4) పరశురామ్(బుజ్జి):
2018లో ‘గీత గోవిందం’ తో హిట్టు కొట్టాడు.ఆ చిత్రం తరువాత రెండేళ్లు ఖాళీగా ఉన్నాడు. నాగ చైతన్యతో అనుకున్న ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళలేదు. మహేష్ తో ‘సర్కారు వారి పాట’ చేసే అవకాశం వచ్చింది. 2022 లోనే ఈ సినిమా విడుదల అని అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ ఏడాది.. ఇతని నుండీ సినిమా లేనట్టే..!
5) సందీప్ రెడ్డి వంగా:
2017 లో ‘అర్జున్ రెడ్డి’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా.. అదే చిత్రాన్ని బాలీవుడ్లో ‘కబీర్ దాస్’ గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ఆందుకున్నాడు. కానీ తెలుగులో ఇతని నుండీ సినిమా వచ్చి 3 ఏళ్ళు దాటింది. ఈ ఏడాది కూడా ఇతని నుండీ సినిమా లేనట్టే..!
6) అజయ్ భూపతి:
2018 లో ‘ఆర్.ఎక్స్.100’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.2 ఏళ్ళ నుండీ ఇతని సినిమా విడుదల కాలేదు. శర్వానంద్ తో చేస్తున్న ‘మహా సముద్రం’ ఈ ఏడాది అయినా విడుదల అవుతుందా అనేది పెద్ద ప్రశ్న.
7) నాగ్ అశ్విన్:
‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ తో సినిమా అని అనౌన్స్ చేసాడు. అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలీదు. ఈ ఏడాది కూడా ఇతని నుండీ సినిమా లేనట్టే..!
8) రాహుల్ సంకృత్యాన్:
2018 లో ‘టాక్సీ వాలా’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. తరువాత నాని తో ‘శ్యామ్ సింగ రాయ’ మొదలుపెట్టాడు. ఈ ఏడాది అది విడుదలవుతుందా అనేది చూడాలి.
9) గౌతమ్ తిన్ననూరి:
2019లో ‘జెర్సీ’ తో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. కాబట్టి.. తెలుగులో అయితే ఇతని నుండీ ఏడాది సినిమా లేనట్టే..!
10) శేఖర్ కమ్ముల:
2017 లో ‘ఫిదా’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న శేఖర్ కమ్ముల.. నుండీ సినిమా వచ్చి 3 ఏళ్ళు దాటింది. నాగ చైతన్యతో మొదలు పెట్టిన ‘లవ్ స్టోరీ’ ఈ ఏడాది విడుదలవుతుందా అనేది పెద్ద ప్రశ్న.