యాంకర్ ప్రదీప్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు మున్నా దూలిపుడి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ‘ఎస్వీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్వీ.బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘నీలి నీలి ఆకాశం’ అనే ఒక్క పాటతో ఈ సినిమాకి బోలెడంత హైప్ ఏర్పడింది. ఇక ‘జి.ఏ2.పిక్చర్స్’ ‘యూ.వీ. క్రియేషన్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ముందుకు రావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయనే చెప్పొచ్చు.
జనవరి 29న విడుదలైన ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం
1.45 cr
సీడెడ్
0.77 cr
ఉత్తరాంధ్ర
0.49 cr
ఈస్ట్
0.33 cr
వెస్ట్
0.28 cr
కృష్ణా
0.30 cr
గుంటూరు
0.38 cr
నెల్లూరు
0.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.15 cr
ఓవర్సీస్
0.14 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
4.51 cr
’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రానికి 4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి. మూడు రోజులు పూర్తయ్యే సరికి ఈ చిత్రం 4.51కోట్ల కలెక్షన్లను రాబట్టింది.. మరో 0.50 కోట్ల షేర్ ను రాబడితే ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచినట్టే అని చెప్పాలి. ఏమైనా ఈ చిత్రం కనుక బ్యాలన్స్ కలెక్షన్లను రాబడితే మాత్రం యాంకర్లలో హీరోగా మారి హిట్టు కొట్టిన మొదటి వాడిగా ప్రదీప్ రికార్డు సృష్టించినట్టే.