రియాలిటీ షోలు టాక్ షోలు సినిమా ఈవెంట్స్.. అంటూ బిజీగా ఉండే ప్రదీప్ మొదటి సారి తన సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా మారాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాతో ఈ యాంకర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ప్రదీప్ ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు.
అసలైతే ఈ సినిమాను గత ఏడాదే రిలీజ్ చేయాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయక తప్పలేదు. సంక్రాంతికి తేవాలని అనుకున్నారు గాని పోటీ ఎక్కువగా ఉండడం వలన రిస్క్ చేయలేదు. ఇక మొత్తానికి ఈ జనవరి 29న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే ఉంది. అయితే ప్రదీప్ ఆ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటాడా లేదా అనేది హాట్ టాపిక్ మారింది. ఆ లెక్కలపై ఒక లుక్కేస్తే..