సిద్ధార్థ్ కి తెలుగులో ఇప్పటికీ ఎంతో కొంత మార్కెట్ ఉంది. ఆ కారణంతోనే అతను నటించే ప్రతి సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘3 BHK'(3BHK) సినిమా 2025 జూలై 4న రిలీజ్ అయ్యింది.
శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని వంటి స్టార్స్ కూడా నటించారు.అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించారు. సొంతింటి ఇల్లు కొనుక్కోవాలని ఆశపడ్డ ఓ కుటుంబం.. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా థియేటర్లలో ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ‘ఓటీటీ సినిమా ఇది’ అంటూ చాలా మంది ప్రేక్షకులు పెదవి విరిచారు. అందువల్ల ఆశించిన ఫలితాన్ని ఈ సినిమా అందుకోలేదు అనే చెప్పాలి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.65 cr |
| సీడెడ్ | 0.11 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.55 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.31 cr |
‘3 BHK’ సినిమాకు రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.1.31 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.28 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా బయ్యర్స్ కి రూ.1.19 కోట్ల నష్టాలు మిగిల్చి డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా.