Bhola Shankar movie: భోళా శంకర్ సినిమా భారమంత చిరుదే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా శుక్రవారం (ఆగస్టు 11) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమాపై నిజంగా చెప్పాలంటే మెగా అభిమానుల్లోనే అంచనాలు లేవు. ఎక్కడో తేడా కొట్టేస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఐరన్ లెగ్‌లు ఈ సినిమాలో ఉన్నారు. వీళ్ళ ఎఫెక్ట్‌తో ఈ సినిమా అసలు గట్టెక్కుతుందా ? అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ముందుగా ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ ఎంత ఐరన్ లెగ్ డైరెక్టర్ అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు.

అసలు మెహర్ రమేష్ ను గత పది సంవత్సరాలుగా ఏ టాలీవుడ్ హీరో కూడా దగ్గరకు రానివ్వలేదు. శక్తి – షాడో – కంత్రి లాంటి డిజాస్టర్ ల దెబ్బతో ఆ సినిమాలు తీసిన వాళ్లంతా కుదేలైపోయారు. పదేళ్ల తర్వాత అది కూడా ఊర మాస్ సినిమాకు పిలిచి మరి చిరంజీవి అవకాశం ఇవ్వటం మెగా అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సినిమాలో చిరంజీవికి చెల్లిగా న‌టించిన‌ కీర్తి సురేష్‌కు మహానటి సినిమా తర్వాత ఆమెకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కలేదు.

చివరకు ఓటీడీలలో ఆమె సినిమాలు చేసినా అవి కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. కీర్తి కూడా పెద్ద ఐరన్ లెగ్ అయిపోయింది. ఇక అక్కినేని హీరో సుశాంత్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోగా సరైన హిట్లు లేవు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న సినిమాలు కూడా ఆడటం లేదు. రీసెంట్గా రవితేజ రావణాసుర సినిమా చేస్తే డిజాస్టర్ అయ్యింది. పైగా రవితేజ రెండు వ‌రుస‌ సూపర్ హిట్లతో ఉండి రావణాసురతో డిజాస్టర్ కొట్టాడు.

ఇక నాలుగో ఐరన్ లెగ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సాగ‌ర్ మ‌హ‌తి. అస‌లు మ‌నోడి పాట‌లు, థీమ్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. మ‌నోడు కూడా పెద్ద రాడ్ రంబోలా మ్యూజిక్ ఇచ్చాడంటున్నారు. ఇంత‌మంది ఐరెన్‌లెగ్‌లు ఉన్న ఈ సినిమాను (Bhola Shankar) చిరంజీవి సింగిల్ హ్యాండ్‌తో ఎంత వ‌ర‌కు గ‌ట్టెక్కిస్తాడో ? చూడాలి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus